కంటతడి పెట్టిన పాయల్ రాజ్ పుత్
Payal Rajput : “ఆర్ఎక్స్ 100” సినిమాతో యువత హృదయాలకు కొల్లగొట్టిన పాయల్ రాజ్ పుత్(Payal Rajput) భావోద్వేగానికి గురయింది. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన “మంగళవారం” సినిమా సక్సెస్ మీట్ లో ఆమె కంటతడి పెట్టింది. “ఆర్ఎక్స్ 100” ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో ఇటీవల విడుదల అయిన “మంగళవారం” పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అజయ్ భూపతి-పాయల్ రాజ్ పుత్ కాంబోలో వచ్చిన రెండో చిత్రం కూడా విజయం సాధించడంతో ఆమె భావోద్వేగానికి గురయింది.
Payal Rajput Emotional
“ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. “మంగళవారం” సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. ఈ సంతోసాన్ని తెలియజేయడానికి నాకు మాటలు రావడం లేదన్నారు. టాలీవుడ్ లో నన్ను మరోసారి హీరోయిన్ గా లాంచ్ చేసిన అజయ్ భూపతికి ధన్యవాదాలు. నా శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. గత మూడు నాలుగేళ్ళుగా ఇలాంటి ఆదరణ కోసమే ఎదురుచూస్తున్నా… ఈ సినిమాతో నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది అంటూ” ఆనంద బాష్పాలతో పాయల్ భావోద్వేగానికి గురయింది.
Also Read : Sanjay Gadhvi: ధూమ్ సిరీస్ దర్శకుడు మృతి