Payal Ghosh: మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ప్రయాణం’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బెంగాల్ బ్యూటీ పాయల్ ఘోష్. ఆ తర్వాత తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో ‘ఊసరవెళ్లి’ వంటి పలు చిత్రాల్లో అదృష్టం పరీక్షించుకున్నారు. ఆ తరువాత బాలీవుడ్ కు మకాం మార్చారు. అయితే పాయల్ ఘోస్ ఎప్పుడూ సినిమాల కంటే సంచలన వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, గౌతం గంభీర్ లను ఉద్దేశ్యించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు.
Payal Ghosh – ఇర్ఫాన్‌తో ప్రేమలో ఉన్నపుడు గంభీర్ మిస్డ్కాల్స్ ఇచ్చేవాడు… నటి పాయల్ ఘోష్
టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, గౌతం గంభీర్‌లను ఉద్దేశించి నటి పాయల్ ఘోష్(Payal Ghosh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇర్ఫాన్ తో తను ప్రేమలో ఉన్నపుడు… మరో క్రికెటర్ గౌతమ్ గంభీర్ తనకు తరచూ మిస్డ్ కాల్స్ ఇచ్చే వాడంటూ సంచలన ఆరోపణలు చేసారు. అంతేకాదు ఈ విషయం ఇర్ఫాన్ పఠాన్‌కు బాగా తెలుసు… ఎందుకంటే అతడు నా ఫోన్ కాల్స్ మొత్తం చెక్ చేసేవాడు అంటూ ఆమె బాంబు పేల్చింది.
ఈ విషయాన్ని యూసఫ్ పఠాన్ (ఇర్ఫాన్ పఠాన్ సోదరుడు), హార్దిక్, కృనాల్ పాండ్యా సమక్షంలో అతడే స్వయంగా నాకు చెప్పాడు. పుణెలో బరోడా జట్టు దేశవాళీ మ్యాచ్ జరుగుతున్నపుడు ఇర్ఫాన్‌ను కలవడానికి వెళ్లినపుడు… అతడు నా ఫోన్ చెక్ చేసినట్లు చెప్పినట్లు ఆమె తెలిపింది.
అయితే తాను ఇర్ఫాన్‌ని తప్ప ఎవరినీ ప్రేమించలేదని… ఇర్ఫాన్ తో బ్రేకప్ తర్వాత అనారోగ్యం పాలై ఐదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాను అని ఆమె తెలిపింది. నేను ప్రేమించిన ఏకైక వ్యక్తి ఇర్ఫాన్… ఇర్ఫాన్ తర్వాత నేనెవరినీ ప్రేమించలేదు’’ అంటూ శుక్రవారం వరుస ట్వీట్లు చేసిన పాయల్ ఘోష్(Payal Gosh)… ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్‌తో దిగిన సెల్ఫీని ఆమె షేర్ చేశారు.
బాలీవుడ్ దర్శకుడిపై లైంగిక ఆరోపణలు చేసిన పాయల్
కొంతకాలం క్రితం బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్… తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపించిన ఆమె… అప్పట్లో ఓ సూసైడ్ నోట్ షేర్ చేసి బాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి తరచుగా మాట్లాడే పాయల్ ఘోష్.. వన్డే ప్రపంచకప్-2023 అయిపోయిన తరువాత నుంచి క్రికెటర్ల గురించి తన సోషల్ మీడియా అకౌంట్లలో ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు.
షమీ ‘ఇంగ్లిష్’ గురించి సెటైర్లు వేసిన బెంగాలీ బ్యూటీ
భారత్ వేదికగా వరల్డ్‌కప్-2023లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా పేసర్ మహ్మద్ షమీ గురించి పాయల్ అప్పట్లో ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మ్యాచ్ అనంతరం షమీ కేవలం హిందీలో మాత్రమే మాట్లాడటాన్ని ఉద్దేశించి.. ‘‘షమీ నువ్వు నీ ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకో.. నేను నిన్ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని పాయల్(Payal) వ్యంగ్యస్త్రాలు సంధించారు. దీనితో షమీ ఫ్యాన్స్ ఫాయల్ పై ఫైర్ అయ్యారు.
పాయల్ పై నెటిజన్ల ఆగ్రహం
ఇది ఇలా ఉండగా మాజీ టీంఇండియా క్రికెటర్లపై పాయల్ చేసిన వ్యాఖ్యలపై అటు ఇర్ఫాన్ పఠాన్ గానీ.. ఇటు గంభీర్ గానీ ఇంతవరకు స్పందించలేదు. అయితే, వారి అభిమానులు మాత్రం.. ‘‘కేవలం వార్తల్లో నిలవడానికి మాత్రమే.. అందరి చూపును తన వైపునకు తిప్పుకొనేందుకే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తుంది. ఆమె ఒక అటెన్షన్ సీకర్’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Prithviraj Sukumaran: పాన్ వరల్డ్ సినిమాగా పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఆడు జీవితం’