Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఇటీవల తమిళనాడు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఆయన ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఎస్‌జె సూర్య, యోగిబాబు అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. పవన్(Pawan Kalyan) ప్రశంసలపై ఆనందం వ్యక్తం చేసిన వారిద్దరూ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. దీనిపై తాజాగా పవన్‌కల్యాణ్ స్పందించారు. వారికి విషెస్ చెప్పారు. ఫ్యూచర్‌లో మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
Pawan Kalyan Appreciates
‘‘థాంక్యూ ఎస్.జె.సూర్య. మీతో కలిసి వర్క్ చేయడం నాకు గొప్ప అనుభూతి అందించింది. యాక్టింగ్, దర్శకత్వంలోనే కాకుండా వివిధ విభాగాల్లో కూడా ఆసాధారణ ప్రతిభ నిజంగా స్ఫూర్తిదాయకం. ‘ సరిపోదా శనివారం’తో ఘన విజయాన్ని అందుకున్నందుకు కంగ్రాట్స్. భవిష్యత్తులో మీరు నటించిన మరెన్నో చిత్రాలు చేయాలి. ఇదే విజయాన్ని సొంతం చేసుకోవాలి’’ అని అన్నారు. ‘‘నాపై ప్రశంసలు కురిపించి, నన్ను ఎంతగానో ప్రోత్సహించినందుకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు థాంక్యూ’’ అని యోగిబాబు ట్వీట్ చేశారు. ‘‘ థాంక్యూ యోగీబాబు. మీ హాస్యచతురత, యాక్టింగ్ స్కిల్స్ నిజంగా ప్రశంసనీయం. వివిధ పాత్రల్లో మీరు కనిపించే విధానం ప్రత్యేక ఆకర్షణ ను అందిస్తుంది. ‘ మండేలా’లో మీ నటన నన్ను బాగా ఆకట్టుకుంది. భవిష్యత్తులో మీరు చేయనున్న ప్రాజెక్టులు అన్నింటికీ నా బెస్ట్ విషెస్’’ అని తెలిపారు.
Also Read : Priyanka Mohan : షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో ప్రమాదం అంచుల వరకు ప్రియాంక మోహన్