Pawan Kalyan OG: యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఓజి’ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్). డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న బారీ బడ్జెట్ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మీ విలన్ రోల్ లో నటిస్తుండగా… ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జపాన్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, వెంకట్ కీలకపాత్రలు పోషిస్తుండగా… ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు… సాహో లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా తరువాత సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
దీనితో ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా బిజీగా ఉండటం… 2024 సార్వత్రిక ఎన్నికలు కూడా దగ్గరపడటంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఆశక్తికరమైన చర్చ జరిగేది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. దీనితో ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Pawan Kalyan OG – ‘అత్తారింటికి దారేది’ రిలీజ్ రోజునే ‘ఓజి’ కూడా
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజి’ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. దీనితో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి కారణం… సరిగ్గా 11 ఏళ్ళ క్రితం ఇదే రోజున పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ విడుదలై… ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం. సరిగ్గా పదకొండేళ్ల క్రితం అనగా 2013 సెప్టెంబర్ 27 న పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలైయింది. ఆ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే… పైరసీ ద్వారా ఇంటర్ నెట్ లో ప్రత్యక్షం కావడంతో… హడావుడిగా సినిమాను రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే ఆ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలవడం… అదే డేట్ కి ఓజి కూడా రిలీజ్ ఆవుతుండడంతో మరొక్కసారి బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ హిస్టరీ రిపీట్ చేయడం ఖాయం అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Also Read : Jyothika Amma Vodi: ఆకట్టుకుంటోన్న జ్యోతిక “అమ్మ ఒడి” ట్రైలర్ !