OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించిన చిత్రం ఓజీ. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరింత ఆసక్తిని రేపుతోంది. మెగా ఫ్యాన్స్ దీని కోసం ఎదురు చూస్తున్నారు. హై బడ్జెట్ తో దీనిని రూపొందించారు. యాక్షన్, థ్రిల్లర్ గా రాబోతోందని మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్బంగా మూవీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఓజీ(OG) చిత్రాన్ని వచ్చే సెప్టెంబర్ నెలలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
OG Movie Updates
రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో తీశారు. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోనే అతి భారీ ఇన్వెస్ట్ తో తీస్తున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీలో కూడా అత్యధికంగా అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాపై . ఈ మూవీని మెగా అభిమానుల కోసం కీలక అప్ డేట్ ఇచ్చినట్లు తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విపరీతమైన సంచలనం సృష్టిస్తోంది ఇంకా రిలీజ్ కాకుండానే.
ఇదిలా ఉండగా సుజీత్ దర్శకత్వం వహించిన ఓజీ చిత్రం ముంబై మాఫియా నేపథ్యంలో పవన్ కళ్యాణ్ శక్తివంతమైన గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ఉత్సాహానికి తోడుగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి తెలుగులో విలన్ గా అరంగేట్రం చేస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ స్వరకర్త థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
ఇది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు ఇప్పటికే సినీ ప్రేక్షకులలో గణనీయమైన హైప్‌ను సృష్టించాయి.
Also Read : Kirrack Boys Khiladi Girls Sensational :కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ రెడీ