Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu). ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఘనత ఏఎం రత్నంకు ఉంది. తన నిర్మాణ సారథ్యంలో వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం గ్యాప్ రావడంతో ప్రస్తుతం పవన్ పై ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ముగ్గురు నటులు బిజీగా ఉన్నారు.
Hari Hara Veera Mallu Movie Release Updates
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో కొనసాగుతున్నారు. ఇక తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ బుచ్చిబాబు సన దర్శకత్వంలో జాన్వీ కపూర్ తో కలిసి ఆర్సీ 16 లో లీనమై పోయాడు. ఇందులో మరో కీలక పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ నటిస్తున్నాడు. మరో వైపు బాబాయి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) డిప్యూటీ సీఎంగా ఉంటూనే సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇందులో అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారనుంది.
ఇక హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు భారీ స్పందన లభించింది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే పవన్ కళ్యాణ్ స్వంతంగా పాట కూడా పాడారు. కాగా మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే మే నెల 9వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు.
కాగా అదే రోజు మాస్ మహరాజా రవితేజ నటిస్తున్న మాస్ జాతర కూడా రిలీజ్ కానుంది. అయితే నిర్మాత రత్నం మార్చి 28న తీసుకు రావాలని అనుకున్నాడు. కానీ వర్కవుట్ కాలేదు. అదే రోజున నితిన్ రెడ్డి, శ్రీలీల కలిసి నటించిన రాబిన్ హుడ్ , మ్యాడ్ స్క్వేర్ మూవీస్ వస్తుండడంతో ఒకింత వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా పాత డేట్ కే ఫిక్స్ అయ్యారు.
Also Read : చెర్రీ బర్త్ డే గిఫ్ట్ నాయక్ రీ రిలీజ్