Pawan Kalyan : ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం తీస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ కీలక పాత్రల్టో నటిస్తున్న ఈ చిత్రం వస్తుందా రాదా , అనుకున్న టైంకు విడుదల చేస్తారా లేదా అన్న అనుమానాలకు తెర దించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. అనుకున్న టైంకు ప్రేక్షకుల ముందుకు పవర్ స్టార్ వస్తాడని వెల్లడించారు. ఇందులో ఎలాంటి ఆందోళన, అనుమానం పడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోయిందని, పోస్ట్ ప్రొడక్షన్ వీఎఫ్ఎక్స్ , డబ్బింగ్ పనులు మిగిలి ఉన్నాయని, వాటిని ఈ నెలాఖరు లోపు పూర్తి చేస్తామన్నారు.
Pawan Kalyan-Hari Hara Veera Mallu Release Updates
ఆపే ప్రసక్తి లేదని పక్కాగా వచ్చే నెల మే9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా హరి హర వీరమల్లును(Hari Hara Veera Mallu) రిలీజ్ చేస్తామన్నారు ఎంఎం రత్నం. భారత దేశ చరిత్రలో ఇది ఓ మైలురాయిగా నిలిచి పోతుందని ధీమా వ్యక్తం చేశారు. స్టార్ ఇమేజ్ కలిగిన ఏకైక నటుడు పవన్ కళ్యాణ్ అని, ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడంలో దర్శకుడు ఫోకస్ పెట్టాడన్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ కు ఎనలేని ఆదరణ లభించిందని చెప్పాడు రత్నం. భారీ బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని, కాసులు కొల్లగొట్టడం ఖాయమన్నాడు.
ఇదిలా ఉండగా హరి హర వీరమల్లు ప్రారంభమై మూడు సంవత్సరాలు అవుతోంది. సాగుతూ వచ్చింది. తొలుత జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించాడు. ఎందుకనో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఆయన స్థానంలో మరో డైరెక్టర్ జ్యోతి కృష్ణ వచ్చాడు. ఇందులో స్పెషల్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ స్వతహాగా తను ఓ పాట కూడా పాడాడు. ఇందులో ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ పోషిస్తున్నాడు. ఆయనతో పాటు సునీల్, సత్యరాజ్, సుబ్బరాజ్ కూడా నటించారు. ఇక సినిమా నుంచి వచ్చే ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు ఆసక్తిగా.
Also Read : Trisha Shocking Comments :ఫ్యాన్స్ కామెంట్స్ ముద్దుగుమ్మ సీరియస్