Parvathy Thiruvothu: నీలమ్ ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై చియాన్ విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘తంగలాన్’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు(Parvathy Thiruvothu) కీలక పాత్రలు పోషిస్తున్నారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. డీ గ్లామర్ పాత్రలో నటీనటుల మేకప్ లు ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. దీనితో ఈ సినిమా కోసం కోలీవుడ్ తో పాటు పాన్ ఇండియాలో అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
Parvathy Thiruvothu Comment
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్టు 15న విడుదల కాబోతున్న‘తంగలాన్’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఈ ప్రమోషన్లలో భాగంగా ‘తంగలాన్’ నటీమణులు మాళవికా మోహనన్, పార్వతి తిరువోతు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నటి కాకపోయి ఉంటే ఏ రంగంలోకి అడుగుపెట్టేవారని విలేకరి ప్రశ్నించగా… ‘‘టీ షాపు పెట్టేదాన్ని. వృత్తి ఏదైనా సరే మర్యాద, గౌరవంతో పనిచేయాలనుకున్నా. అందులో భాగంగానే టీ షాపు పెట్టాలనుకున్నా’’ అని పార్వతి(Parvathy Thiruvothu) చెప్పారు. అనంతరం మాళవిక మాట్లాడుతూ ‘‘విజువల్ ఆర్ట్స్ అంటే నాకు ఇష్టం. ఫొటోగ్రఫీ, లేదా సినిమాటోగ్రఫీ వైపు అడుగులు వేయాలనుకున్నా’’ అని బదులిచ్చారు.
‘‘పా.రంజిత్ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ‘తంగలాన్’లో నాది గంగమ్మ అనే కీలక పాత్ర. ఈ పాత్ర కోసం ఎంతో శ్రమించా. భాషపరంగా కసరత్తు చేశా’’ అని పార్వతి తిరువోతు తెలిపారు. ‘‘ఈ సినిమా ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఈ షూటింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రోజూ మేకప్ వేసుకోవడానికి దాదాపు నాలుగు గంటల పట్టేది. ఎక్కువ శాతం ఎండలోనే ఉండేవాళ్లం. దాంతో శరీరంపై దద్దుర్లు వచ్చిన సందర్భాలున్నాయి. దాంతో రోజూ సెట్‌లో డెర్మటాలజిస్ట్, కళ్ల డాక్టర్… ఇలా మొత్తం ఐదుగురు వైద్యులు ఉండేవారు’’ అని మాళవిక వివరించారు.
కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) కార్మికుల జీవితాల ఆధారంగా పా.రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రధారులు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. ‘నేను ఇప్పటివరకు ఏ సినిమా కోసం ఇంత కష్టపడలేదు. ఇదొక విభిన్నమైన కథ. ఇందులో గ్లామర్‌కు చోటులేదు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు మరో ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది’ అని ఓ సందర్భంలో విక్రమ్ తెలిపారు. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుంది.
Also Read : Rashmika Mandanna : రష్మిక నటించిన రెండు ప్రాజెక్టులు ఒకేరోజు రిలీజ్