Paruchuri Gopala Krishna: పవన్ కళ్యాణ్ పై పరుచూరి ప్రశంసల జల్లు !

పవన్ కళ్యాణ్ పై పరుచూరి ప్రశంసల జల్లు !

Hello Telugu - Paruchuri Gopala Krishna

Paruchuri Gopala Krishna: ఆంధ్రప్రదేశ్‌ లో అసాధారణ విజయాన్ని సొంతం చేసుకున్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా కూటమి సభ్యులకు విషెస్‌ చెప్పగా… తాజాగా రచయిత పరుచూరి గోపాలకృష్ణ(Paruchuri Gopala Krishna) అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పురందేశ్వరి, పవన కల్యాణ్‌ లతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Paruchuri Gopala Krishna…

‘నేను పవన్‌ కళ్యాణ్ సినిమాకు పని చేయలేదు. మేమిద్దరం ఒక్కసారే కలిశాం. పవన్‌ కు బిడియం ఎక్కువ. కానీ, ఈ ఎన్నికల్లో భావోద్వేగంతో, విశ్వాసంతో పని చేశాడు. ఏ క్షణం ఆయన కళ్లలోకి చూసినా ‘నేను సాధిస్తున్నా’ అనే విశ్వాసం కనిపించింది. ఆయన అభిమానులు ఎంత ఎమోషనల్‌గా ఉంటారో నాకు తెలుసు. పవన్‌ కళ్యాణ్ ను చూసినప్పుడు వాళ్ల అరుపులు వింటే కంఠ నరాలు తెగిపోతాయేమో అనిపిస్తుంది. అంత గొప్ప ఫ్యాన్స్ ఆయన సొంతం. వాళ్లందరినీ ఒప్పించి టీడీపీ, బీజేపీలతో కలవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ప్రజలను మెప్పించి విజయం సాధించారు. ఒకవేళ ఆయన కూటమిలో భాగం కాకపోతే ఏమయ్యేదో చెప్పలేకపోయేవాళ్లం. ఆ పరిస్థితి రానివ్వకుండా నిర్ణయాలు తీసుకున్నారు. గెలిచాక కూడా పవన్‌ ఎంతో వినయంతో ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటలను ఎలా నేరవేర్చాలనే ఆలోచనతోనే మాట్లాడారు. ఎవరినీ నిందించలేదు. అలా మాట్లాడడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం’ అంటూ పవన్‌పై ప్రశంసలు కురిపించారు.

‘ప్రజలు ఒక్కోసారి బయటపడకుండా నిశ్శబ్దంగా విప్లవం చేస్తారు. ఈ ఎన్నికల్లో అదే జరిగింది. ప్రజలు కోరుకున్నవిధంగా రాజకీయ నాయకులు ఉండకపోతే నిశ్శబ్ద విప్లవాలు జరుగుతాయని నిరూపించారు. నాకు చంద్రబాబుతో మంచి అనుబంధం ఉంది. ఆయన గవర్నమెంట్‌ లో గతంలో నేను పని చేశాను. పోరాటశక్తికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు. ఆయన అరెస్ట్‌ చాలా బాధాకరమైన విషయం. దాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఎన్నికల ముందు జోరుగా ప్రచారం చేశారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం ఏమవుతుందోనని భయపడ్డాను. ప్రజలను మెప్పించారు. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబును పరుచూరి గోపాలకృష్ణ(Paruchuri Gopala Krishna) అభినందించారు.

‘నాకు పురందేశ్వరి చెల్లెలితో సమానం. ఆమె గెలవాలని కోరుకున్నాను. బాలకృష్ణ గెలుస్తారని ముందే తెలుసు. ఆయనతో పాటు పురందేశ్వరి కూడా గెలవాలని కోరుకున్నా. ఆమె రాజమహేంద్రవరం ఎంపీగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉంది. తెలుగుకు మరోసారి వెలుగు తెచ్చేందుకు ఆమె కృషి చేయాలని కోరుకుంటున్నా’ అన్నారు.

Also Read : Ram Pothineni: మహేశ్‌బాబు దర్శకత్వంలో రామ్‌ పోతినేని ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com