Parking: ఆస్కార్‌ లైబ్రరీలో స్థానం దక్కించుకున్న కోలీవుడ్ సినిమా ‘పార్కింగ్‌’ !

ఆస్కార్‌ లైబ్రరీలో స్థానం దక్కించుకున్న కోలీవుడ్ సినిమా 'పార్కింగ్‌' !

Hello Telugu - Parking

Parking: చిన్న సినిమాగా విడుదలై… విమర్శకుల మెప్పు పొందిన తమిళ సినిమా ‘పార్కింగ్‌’కు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్‌ లైబ్రరీలో ‘పార్కింగ్‌’ సినిమా స్క్రీన్‌ ప్లేకు చోటు దక్కింది. హరీష్‌ కల్యాణ్, ఎమ్‌ఎస్‌ భాస్కర్, ఇందుజా రవిచంద్రన్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన తమిళ చిత్రం ‘పార్కింగ్‌’. రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, సుధన్‌ సుందరం–కేఎస్‌ సినీష్‌ నిర్మించిన ఈ చిత్రం 2023 డిసెంబరు 1న విడుదలై, మంచి విజయం సాధించింది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ. 15 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లుగా కోలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఓటీటీ ఫ్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు… ఇతర భాషల నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ నేపథ్యంలో ‘పార్కింగ్‌(Parking)’ సినిమా స్క్రీన్‌ ప్లేకు ఆస్కార్‌ లైబ్రరీలో శాశ్వతంగా చోటు కల్పిస్తున్నామని ఆస్కార్‌ మేనేజింగ్‌ లైబ్రేరియన్‌ ఫిలిఫ్‌ గార్సియా నుంచి ఇ–మెయిల్‌ వచ్చిందని చిత్రనిర్మాత కేఎస్‌ సినీష్‌ సోషల్‌ మీడియాలో పేర్కొని, ఆనందం వ్యక్తం చేశారు.

Parking Movie Updates

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే… ఒకే ఇంట్లో అద్దెకు ఉండే ఐటీ ఉద్యోగి ఈశ్వర్, ప్రభుత్వోద్యోగి ఎస్‌. ఇళంపరుతి పార్కింగ్‌ విషయంలో ఈగోలకు పోయి ఒకరికి ఒకరు ఎలా హాని చేసుకున్నారు? ఆ తర్వాత తమ తప్పులను ఎలా తెలుసుకున్నారు? అనే అంశాల నేపథ్యంతో ఈ ‘పార్కింగ్‌’ కథ సాగుతుంది. చిన్న చిన్న ఈగోలకు పోయి కుటుంబాలను ఎలా నాశనం చేసుకుంటారు అనే విషయాన్ని… చాలా సున్నితంగా, ఆశక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ సఫలీకృతుడయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. మరి అలాంటి సినిమా ఆస్కార్ లైబ్రరీలో స్థానం దక్కించుకోవడం నిజంగా అభినందించాల్సిన విషయమే.

Also Read : Tripti Dimri: ‘పుష్ప 2’ ఐటెం సాంగ్ లో ‘యానిమల్’ బ్యూటీ ?

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com