ఉదయ్ పూర్ – ఆప్ ఎంపీ, ప్రముఖ నటి పరిణీతి చోప్రా ఒక్కటయ్యారు. ఆదివారం అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. సినీ , రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు పెళ్లికి హాజరయ్యారు. నూతన జంటను ఆశీర్వదించారు.
ఉదయ్ పూర్ లోని లీలా ప్యాలెస్ లో వివాహ వేడుక జరిగింది. మనీష్ మల్హోత్రా రూపొందించిన దుస్తులను ధరించింది నటి పరిణీతి చోప్రా. మేవార్ సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు నిర్వహించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హాజరయ్యారు.
వీరితో పాటు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మాజీ క్రికెటర్ భర్భజన్ సింగ్ , ఎంపీ సంజయ్ సింగ్, శివసేన నేత ఆదిత్యా ఠాక్రే, మనీష్ మల్హోత్రా , తల్లి మధు చోప్రా హాజరయ్యారు. విచిత్రం ఏమిటంటే స్వంత సోదరి ప్రముఖ నటి ప్రియాంక చోప్రా మిస్ అయ్యారు.
తాను హాజరు కావడం లేదంటూ మీకు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది ఇన్ స్టాలో. అంతకు ముందు సంగీత్ విభావరి నిర్వహించారు. ఇదిలా ఉండగా గత మే నెల 13న ఢిల్లీలో పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాల నిశ్చితార్థం జరిగింది.