బాలీవుడ్ కు చెందిన నటి పరిణీతి చోప్రా. ఇటీవల నెట్టింట్లో వైరల్ గా మారారు. కారణం ఆప్ నేత , ఎంపీ రాఘవ్ చద్దాతో పెళ్లి చేసుకుంది. అలా హానీమూన్ వెకేషన్ కు వెళ్లే సమయంలో అక్షయ్ కుమార్ తో తను నటించిన మిషన్ రాణీగంజ్ చిత్రం రిలీజ్ అయ్యింది.
ఇది అక్షయ్ నిజ జీవితం ఆధారంగా తీశారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా ఎందుకనో సినిమా ఆకట్టు కోలేక పోయింది. దీంతో ఈ అమ్మడికి పెళ్లి చేసుకున్న ఆనందం ఆవిరై పోయింది. ఆమధ్యన హాట్ ఫోటో షూట్స్ కోసం ఫోటోలు దిగింది. అవి నెట్టింట్లో వైరల్ గా మారాయి.
ప్రస్తుతం అక్షయ్ తో పరిణీతి చోప్రా లవ్, రొమాంటిక్ సాంగ్ లో నటించింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు కూడా హల్ చల్ అయ్యాయి. స్వయంగా అక్షయ్ కుమార్ సాంగ్ కు సంబంధించి వీడియోను షేర్ చేసినా ఫలితం లేకుండా పోయింది.
మొత్తం మీద అందాల ఆరబోత కంటే, కథా పరంగా పవర్ ఫుల్ గా ఉంటే సినిమా సక్సెస్ అవుతుందని తెలుసుకుంటే మంచిదని స్టార్ నటుడు అక్షయ్ కుమార్ కు సెలవిస్తున్నారు ఫ్యాన్స్.
ఇదే ఏడాది లో షారుక్ ఖాన్ కు బాగా కలిసొచ్చింది. అలాగే పిల్లల తల్లి అయిన నయన తార, దీపికా పదుకొనే సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ పరిణీతికి నిరాశే మిగిలింది.