Parineeti Chopra: సినిమా నటీనటులకు ఫ్యాన్స్ ఒక ఇంధనం లాంటివారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా తన అభిమాన నటుల సినిమాలను ఆదరిస్తారు. సినిమా హిట్ అయినా… ఫట్ అయినా… అభిమాన హీరోల బర్త్ డే వేడుకులకు బ్యానర్స్, కౌటౌట్లు, ఫ్లెక్సీలు పెట్టి ఓ పండుగలా జరుపుతూ ఉంటారు. అయితే సోషల్ మీడియా విజృంభణతో వీటికి అదనంగా ఫ్యాన్ క్లబ్బులు, ఫ్యాన్ పేజీలు చేరాయి.
Parineeti Chopra Warning
దీనితో తన అభిమాన నటుల సినిమా రిలీజ్ అయితే చాలు… సినిమా ప్రమోషన్ కోసం ఏవోవో పుకార్లను ఫ్యాన్ పేజీల్లో పోస్ట్ చేస్తున్నారు. ఆ హీరోకు మా సినిమా నచ్చింది… ఈ హీరో మా సినిమాను ప్రశంసించాడు అంటూ అయితే ఇలాంటి రూమర్స్ ను క్రియేట్ చేస్తుంటారు. అయితే ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్న బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా(Parineeti Chopra)… ఈ ఫ్యాన్ క్లబ్బులు, ఫ్యాన్ పేజీలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతేకాదు ఇలాంటివి రిపీట్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Parineeti Chopra – “మిషన్ రాజీగంజ్” సినిమాపై ఫ్యాన్స్ క్లబ్ పోస్టులపై పరిణితి ఆగ్రహం
ఇటీవల తాను నటించిన “మిషన్ రాజీగంజ్” సినిమాపై ఫ్యాన్స్ క్లబ్బులు, ఫ్యాన్ పేజీలు సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై ఆమె ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ విధంగా ఫ్యాన్స్ క్లబ్బులు, ఫ్యాన్ పేజీల నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చింది. ‘‘నా పేరుని ఉపయోగించి కొన్ని ఫ్యాన్ పేజీలు తమ అభిమాన నటీనటులకు ఫేవర్‌గా పోస్టులు క్రియేట్ చేస్తున్నాయి. అవి నా దృష్టికి వచ్చాయి. ఆ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. ఏ ఒక్కరినీ ప్రశంసించడానికి లేదా అభినందించడానికి నేను ఎలాంటి ఇంటర్వ్యూలూ ఇవ్వలేదు. ఇలాంటివి రిపీటైతే… రిపోర్ట్ చేస్తా. మీరు ఏదైనా పోస్టు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోండి. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు’’ అని ఆమె పోస్ట్ చేసారు. అయితే ఆమె ఒక్కసారిగా ఇలా రియాక్ట్ కావడానికి కారణం ఏమిటి ? అనేది మాత్రం పూర్తిగా చెప్పలేదు.
‘లేడీస్ vs రికీ బహ్ల్’తో బాలీవుడ్ ఎంట్రీ… ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో వివాహం
‘లేడీస్ vs రికీ బహ్ల్’ సినిమాతో 2011లో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పరిణీతి చోప్రా… ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ‘కిల్ దిల్’, ‘డిష్యూం’, ‘కేసరి’, ‘సైనా’, ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’ చిత్రాల్లో ఆమె నటించి ప్రేక్షకులను మెప్పించారు. గత కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమలో మునిగి తేలిన ఆమె ఈ ఏడాది సెప్టెంబర్ 24న అతడ్ని పెళ్ళి చేసుకుని ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తుంది.
పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న పరిణీతి ఇటీవలే తాము జరుపుకున్న తొలి పండుగ కర్వా చౌత్ ఫొటోలు షేర్ చేసి మురిసిపోయింది. తాజాగా ఫ్యాన్స్ క్లబ్స్, ఫ్యాన్ పేజీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్న అమర్ సింగ్ చమ్కిలాలో అమర్‌జోత్ కౌర్ పాత్రను పోషిస్తుంది. ఇది కాకుండా, ఆమె చేతిలో ప్రేమ్ కి షాదీ, సంకీ, షిద్దత్ 2 మరియు జహూర్ వంటి మరికొన్ని ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి.
Also Read : Vijay Sethupathi: పిశాచి దర్శకుడితో విజయ్ సేతుపతి కొత్త సినిమా ?