Parineeti Chopra : ప్రముఖ పంజాబీ సింగర్ అమర్ సింగ్ చంకీల 27 ఏళ్ల వయసులో హత్యకు గురైన సంగతి తెలిసిందే.ఆయన జీవితం ఆధారంగా ‘అమర్‌సింగ్ చంకీల’ సినిమా తెరకెక్కింది. దర్శకుడు: ఇంతియాజ్ అలీ. బాలీవుడ్ నటులు దిల్జిత్ దోసాంజ్, పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది. తన సినిమాలో అమర్‌జోత్ కౌర్ పాత్రపై పరిణీతి స్పందించింది. “‘అమర్‌సింగ్ చుంకిలా’కి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల ఆనందంగా ఉంది. నేను సంతోషంతో కన్నీళ్లను ఆపుకోలేకపోతున్నాను. ‘పరిణీతి ఈజ్ బ్యాక్’ అనే మాటలు చాలా జోరుగా వినిపిస్తున్నాయి. ఇలాంటి రియాక్షన్ వస్తుందని ఊహించలేదు. అవును…నేను తిరిగి వచ్చాను. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. సినీ ప్రేమికులు చూపించే హృదయం ప్రేమతో నిండి ఉంటుంది” అని “X”లో పోస్ట్ చేశారు.
Parineeti Chopra Movies
ప్రియాంక చోప్రా చెల్లెలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి పరిణీతి చోప్రా(Parineeti Chopra), 2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆమె ‘శుద్ద్ దేశీ రొమాన్స్’, ‘ఇషాక్ జాదే’, ‘దావత్ ఏ ఇష్క్’, ‘కిల్ దిల్’, ‘డిష్యుమ్’, ‘గోల్మాల్ ఎగైన్’ మరియు ‘కేసరి మరియు సైనా’ వంటి చిత్రాలలో మహిళా ప్రధాన పాత్ర పోషించింది. గతేడాది ఆప్ యువనేత రాఘవ్ చద్దాను పెళ్లాడింది. పెళ్లయ్యాక ఇక సినిమాలేంటని అందరూ అనుకున్నారు. అయితే, పరి తన తాజా పోస్ట్‌తో అలాంటి ఊహాగానాలకు ముగింపు పలికింది.
Also Read : Rama Ayodhya : ఓటీటీకి సిద్ధమవుతున్న ‘రామఅయోధ్య’ డాక్యుమెంటరీ ఫిల్మ్