Parineeti Chopra : మా ప్రేమ‌ను ఆశీర్వ‌దించండి

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా, ప్ర‌ముఖ న‌టి ప‌రిణీతి చోప్రా వైర‌ల్ గా మారారు. ప్రీ వెడ్డింగ్ కంటే ముందు ఇద్ద‌రు అన్యోన్యంగా ఉన్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి సామాజిక మాధ్య‌మాల‌లో.

ఇటీవ‌లే అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి జ‌రిగింది ఇద్ద‌రికీ. తాజాగా జ‌త చేసిన ఫోటోల‌కు అంద‌మైన క్యాప్ష‌న్స్ కూడా జ‌త ప‌రిచారు ఈ ఇద్ద‌రూ. ఎలాంటి ఒత్తిడి లేదు. అంతకు మించి డ్రామా కూడా లేదు. ఒక‌రినొక‌రం అర్థం చేసుకున్నాం. అడుగులో అడుగులు వేశాం. ముందుకు సాగుతున్నామ‌ని పేర్కొన్నారు ప‌రిణీతి చోప్రా.

మా ప్రేమ‌ను ఆద‌రించండి. మా కుటుంబాల‌ను ఆశీర్వ‌దించండి అంటూ కోరారు. విచిత్రం ఏమిటంటే ప‌రిణీతి చోప్రా ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రాకు రిలేష‌న్. ఇక రాఘ‌వ్ చ‌ద్దా మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్. ఆయ‌న ఆమ్ ఆద్మీ పార్టీలో కీల‌క‌మైన నాయ‌కుడిగా ఉన్నారు.

లండ‌న్ లో చ‌దువుకున్నారు. మంచి స్పీక‌ర్ గా గుర్తింపు పొందారు. ఆ మ‌ధ్యన ఇద్ద‌రూ ఎయిర్ పోర్టు లో కెమెరా కంటికి చిక్కారు. త‌ర్వాత తాము ప్రేమ‌లో ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత నిశ్చితార్థం, పెళ్లి పూర్త‌య్యాయి.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com