Parakramam: ఓటీటీకి వచ్చేస్తోన్న బండి స‌రోజ్ ‘పరాక్రమం’ ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

ఓటీటీకి వచ్చేస్తోన్న బండి స‌రోజ్ 'పరాక్రమం' ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

Hello Telugu - Parakramam

Parakramam: బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘పరాక్రమం(Parakramam)’. బీఎస్‌కే మెయిన్‌ స్ట్రీమ్‌ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ సినిమాలో సరోజ్ సరసన శృతి సమన్వి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్, శాంక్ వెన్నెలకంటి, వంశీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం, నిర్మాతగానూ బండి సరోజ్ కుమార్ వ్యవహరించడం మరో విశేషం. గల్లీ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ మూవీని ఆగస్టు 22న విడుదల చేసారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈనెల 14 నుంచి డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని ఆహా తన ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

Parakramam – ‘పరాక్రమం’ క‌థేమిటంటే ?

తూర్పు గోదావ‌రి లంపకలోవ అనే గ్రామంలో మ‌తిస్తిమితం స‌రిగ్గా ఉండ‌ని స‌త్తిబాబు నాట‌కాలు వేస్తూ జీవిస్తూ ఉంటాడు. అయితే ఓ రోజు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు లోనైన స‌త్తిబాబు త‌న కుమారుడు లోవరాజుతో త‌ను ర‌చించిన ప‌రాక్ర‌మం అనే నాట‌కాన్ని ఎప్ప‌టికైనా వేయాల‌ని, ఆ నాట‌కం వేయ‌డానికి రెడీ అయిన‌ప్పుడు మాత్ర‌మే ఆ బుక్ తెర‌వాల‌ని చెప్పి చ‌నిపోతాడు. దీనితో తండ్రికి ఇచ్చిన మాట కోసం ‘పరాక్రమం’ నాటకాన్ని హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో వేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఇంతకీ పరాక్రమం నాటకంలో ఏముంది..? సత్తిబాబు గతం ఏమిటి..? లోవరాజు రవీంద్ర భారతిలో నాటకం ఎందుకు వేయాలని అనుకుంటాడు..? బుజ్జమ్మ అతడి కోసం ఎందుకు ఎదురుచూస్తుంది..? అనే క‌థ‌నంతో సినిమా సాగుతుంది.

ఇదిలాఉండ‌గా ఈ సినిమాను బండి సరోజ్ కుమార్ అంతా తానే అయి ఈ సినిమాను న‌డిపించాడు. దర్శకత్వం, సంగీతం, ఎడిటింగ్, నిర్మాణం ఇలా అన్ని విభాగాలను ఒక్కడే హ్యాండిల్ చేశాడు. కానీ స్క్రీన్ ప్లే కన్ఫ్యూజన్‌గా సాగడం, క‌థ స్టోగా న‌డ‌వ‌డం ఇబ్బందిక‌రంగా అనిపిస్తుంది. అయితే లోవరాజు క్యారెక్ట‌ర్‌, డైలాగ్స్ బాగా మెస్మ‌రైజ్ చేస్తాయి.

Also Read : Varsha HK: ప్రియుడితో ఎంగేజ్‌ మెంట్‌ చేసుకున్న బుల్లితెర నటి వర్ష !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com