Papa Meri Jaan : డైనమిక్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణ బీర్ కపూర్ , రష్మికా మందన్నా , అనిల్ కపూర్ , సన్నీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం యానిమల్(Animal). ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్, స్టిల్స్, ట్రైలర్ , సాంగ్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి.
Papa Meri Jaan Song Viral
తాజాగా ఇదే మూవీకి సంబంధించి తండ్రీ, కొడుకుల మధ్య ఉన్న బంధంపై ప్రత్యేకంగా రిలీజ్ చేసిన పాపా మేరీ జాన్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రికార్డ్ స్థాయిలో వ్యూయర్ షిప్ దక్కింది ఈ పాటకు. టేకింగ్ లో మేకింగ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న దర్శకుడు వంగా సందీప్ రెడ్డి.
విచిత్రం ఏమిటంటే ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తం తిరిగి వచ్చేసినట్లు సినీ ట్రేడ్ వర్గాల అంచనా. ఇది కూడా ఓ రికార్డ్ అని చెప్పక తప్పదు. ఇక చిత్ర నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ ఏకంగా రూ. 5 కోట్ల విలువ చేసే కారును గిఫ్ట్ గా డైరెక్టర్ కు ఇచ్చినట్లు టాక్.
ఇక పాపా మేరీ జాన్ లో రణ బీర్ కపూర్, అనిల్ కపూర్ పై చిత్రీకరించారు వంగా. మొత్తంగా డిసెంబర్ 1న రిలీజ్ కానున్న యానిమల్ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
Also Read : Rashmika Mandhanna : రష్మిక మందన్నా వైరల్