Pallavi Prasanth: బిగ్ బాస్ సీజన్ 7(Big Boss-7) విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మహావీర్ ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రభుత్వ ఆస్తుల ద్వంసం కేసులో గజ్వేల్ లో వారి స్వగృహంలో అరెస్టు చేసిన పోలీసులు… సుమారు ఆరు గంటల పాటు విచారించిన అనంతం వారిని బుధవారం రాత్రి జడ్జి ఎదుట హాజరుపర్చగా… కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీనితో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్ తో పాటు అతని సోదరుడు మహావీర్ ను చంచల్ గూడ జైల్ కు రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్… చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Pallavi Prasanth in Chanchalguda Jail
బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ ముగిసిన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట పల్లవి ప్రశాంత్ అభిమానులు రచ్చ చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అమర్, అశ్విని, బిగ్ బాస్ సీజన్6 కంటెస్టెంట్ గీతూ రాయల్ కార్లను ధ్వంసం చేశారు. ఇదే సమయంలో ఆరు ఆర్టీసీ బస్సులు, ఒక పోలీసు వాహనంపై కూడా దాడి చేసి అద్దాలను ద్వంసం చేసారు. దీనితో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. దీనిపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు… సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సెక్షన్ 147, 148, 290, 353, 427 r/w 149 IPC, సెక్షన్ 3 PDPP AC కింద కేసులు పెట్టారు. మరోవైపు బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారిపై కాకుండా కార్యక్రమ నిర్వాహకులు, హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునపై కూడా కేసులు నమోదు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతో పాటు హైకోర్టు న్యాయవాది అరుణ్ డిమాండ్ చేశారు.
Also Read : Prashanth Neel : సాలార్ ఉగ్రమ్ రీమేక్ కాదు, రీటెల్లింగ్