Pallavi Prasanth: బిగ్‌బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌కు బెయిల్‌ !

బిగ్‌బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌కు బెయిల్‌ !

Hello Telugu - Pallavi Prasanth

Pallavi Prasanth: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ప్రశాంత్ తో పాటు అరెస్ట్ అయిన మరో ముగ్గురుకి కూడా నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ ను మంజూరు చేసింది. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్టు అయి చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పల్లవి ప్రశాంత్‌… 15వేల రూపాయల పూచీకత్తుతో ఇద్దరు షూరిటీలు ఇచ్చిన తరువాత జైలు నుండి విడుదల చేయాలని అయితే ప్రతి ఆదివారం పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. అంతేకాదు కోర్టు షరతుల ప్రకారం పల్లవి ప్రశాంత్ ఎక్కడా కూడా సమావేశాలు నిర్వహించడం కానీ, మీడియాతో మాట్లాడటం వంటివి చేయకూడదు.

Pallavi Prasanth Got Bail

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7(Big Boss-7)గ్రాండ్ ఫినాలే‌లో పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచి ట్రోఫీని అందుకున్నాడు. ఆ షో ముగిసిన అనంతరం బిగ్ బాస్ హౌస్ బయట తన అభిమానులతో కలిసి ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రశాంత్ అభిమానులు, ఇతర కంటెస్టెంట్ల అభిమానుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ప్రశాంత్ అభిమానులు అక్కడ విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో ఆరు ప్రభుత్వ బస్సులతో పాటు ఒక పోలీసు వాహనం కూడా ధ్వంసం అయ్యాయి.

దీనితో ఈ దాడి ఘటనను సుమోటోగా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుడు మహావీర్ పై వివిధ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసారు. ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చగా, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్‌, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్‌ను చేర్చారు. పల్లవి ప్రశాంత్‌, అతని సోదరుడు మహావీర్‌ను పోలీసులు కోర్టులో హాజరుపర్చగా.. వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. అదే సమయంలో ప్రశాంత్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.

Also Read : Ram Charan: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండేను కలిసిన రామ్‌చరణ్‌ దంపతులు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com