Susheela : ప్రముఖ సినీ గాయని పి సుశీల ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో సుశీల బాధపడుతోన్న సుశీలమ్మకు సడెన్ గా ఉదర సంబంధిత సమస్యలు తలెత్తాయి. దీంతో హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స అందించారు. ఇది సాధారణ కడుపు నొప్పేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. అటు కుటుంబ సభ్యులు కూడా సుశీల(Susheela)మ్మ ఆరోగ్యంపై స్పందించారు.
అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. కాగా పరిస్థితి కుదుట పడడంతో ఈ లెజెండరీ సింగర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సోమవారం (ఆగస్టు 19) ఆస్పత్రి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని సుశీలమ్మే స్వయంగా ఒక ప్రకటన రూపంలో తెలియజేశారు. అదే సమయంలో తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వస్తోన్నవదంతులను నమ్మవద్దని ఆమె అభిమానులను కోరారు. ‘ నేను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. డిశ్చార్జి అయ్యి ఇంటికి కూడా వచ్చాను. అభిమానులు ఆశీర్వాద బలమే నన్ను కాపాడింది’ అని ప్రకటనలో తెలియజేశారు సుశీలమ్మ.
Susheela Comment
కాగా తన ఆరోగ్య పరిస్థితిపై సుశీల(Susheela)మ్మే స్వయంగా ప్రకటన విడుదల చేయడంతో అభిమానులు, సంగీత ప్రియులు ఊపిరి పీల్చుకున్నారు. తేనె కన్నా తీయనైన గానంతో సంగీత ప్రియులను ఉర్రూత లూగించారు సుశీల. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా మొత్తం 9 భాషల్లో 40 వేలకుపైగా పాటలను ఆలపించారు. తన గాన ప్రతిభకు గుర్తింపుగా జాతీయ అవార్డు, పద్మభూషన్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. అయితే వయసు రీత్యా గత కొంత కాలంగా ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు కూడా వయో సంబంధిత సమస్యలతో కనిపించారు.
Also Read : Mollywood Issues : మలయాళ ఇండస్ట్రీ లో లైంగిక వేధింపులపై ‘హేమ కమిటీ’ నివేదిక