Operation Valentine: ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమాపై మెగాస్టార్ ప్రశంసల వర్షం !

‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమాపై మెగాస్టార్ ప్రశంసల వర్షం !

Hello Telugu - Operation Valentine

Operation Valentine: మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ హీరోగా ప్రముఖ యాడ్ ఫిల్మ్‌ మేకర్‌ శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా తెరకెక్కించిన చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, గాడ్‌ బ్లెస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రినైసన్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించిన ఈ బై లింగ్యువల్ ప్రాజెక్ట్ లో వరుణ్‌ తేజ్‌(Varun Tej) ఫైటర్‌ పైలట్‌గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌గా కనిపించనుంది. ‘నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొంది భారత వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను తెరపై ఆవిష్కరించే విధంగా దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా తెరకెక్కించారు.

Operation Valentine Movie Updates

మార్చి 1 న విడుదల కాబోతున్న ‘ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine)’ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఆదివారం గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలో రెండో అత్యున్నత పురష్కారం పద్మ విభూషణ్‌ కు ఎంపికైన సందర్భంగా చిత్ర యూనిట్ మెగాస్టార్ ను గజమాలతో సత్కరించింది.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… ‘‘నేను అమెరికా టూర్ లో ఉన్నప్పుడు వరుణ్‌ నుండి… ‘మీతో మాట్లాడాలి’ అంటూ మెసేజ్ వచ్చింది. ఏమైందో అనుకున్నా… నేను హైదరాబాద్‌ తిరిగొచ్చాక ఈ సినిమా ఈవెంట్‌ సంగతి చెప్పాడు. రియల్‌ హీరోలపై తీసిన చిత్రం గురించి మీరు చెబితే రీచ్‌ వేరేలా ఉంటుందన్నాడు. మనల్ని రక్షించే వారియర్స్‌ గురించి చెప్పడం నాకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా. అందుకే ఈ వేడుకకు రావడం గర్వంగా ఉంది.

తెలుగులో మంచి పారితోషికం ఉంటుందని, కమర్షియల్‌ డైరెక్టర్‌ గా స్థిరపడిపోవచ్చనే ఉద్దేశంతో శక్తి ప్రతాప్‌ ఇక్కడకు రాలేదు. తన సొంత ఖర్చుతో సర్జికల్‌ స్ట్రైక్‌ పై షార్ట్‌ ఫిల్మ్‌ తీశాడు. ఇండియన్‌ ఎయిర్స్‌ ఫోర్స్‌ అది చూసి ఆశ్చర్యపోయింది. ఈ సారి సినిమా తీస్తే మరింత సమాచారం మేమిస్తామని సంబంధిత అధికారులు ఆయన్ను ప్రోత్సాహించారు. ఈ సినిమాను కేవలం 75 రోజుల్లో చిత్రీకరించారు. తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి విజువల్స్‌ ఇవ్వడం ఆషామాషీ విషయం కాదు. ఆ విషయంలో సినిమా విడుదలకు ముందే ఆయన సక్సెస్‌ అయ్యారు. దీన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి’’ అని మెగాస్టార్ పిలుపునిచ్చారు.

‘‘నవదీప్‌ మా కుటుంబ సభ్యుడిలాంటివాడు. రామ్‌ చరణ్‌ ‘ధ్రువ’ సినిమాలో నవదీప్ నటన నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో కూడా మంచి పాత్ర పోషించాడు. అభినవ్‌ ప్రతిభావంతుడు. సోషల్‌ మీడియాలో కనిపించే మీమ్స్‌లో తనే ఎక్కువగా కనిపిస్తాడు. చరణ్‌, వరుణ్‌(Varun Tej)… ఇలా వీరంతా నన్ను చూస్తూ వేరే రంగంలోకి వెళ్లలేకపోయారు. చదువు పూర్తయ్యాక యాక్టర్ అవ్వాలనుకున్నారు. ఈ విషయంలో నేను అందరినీ ప్రోత్సహిస్తా. ఎందుకంటే చిత్ర పరిశ్రమను నేను గౌరవిస్తా. మనం ఎంతగా గౌరవిస్తే అంతగా మనల్ని అక్కున చేర్చుకుంటుందని బలంగా నమ్మా. అలాంటి ఇండస్ట్రీలోకి నా బిడ్డలొచ్చారంటే ఇంతకంటే కావాల్సిందేముంది’’

నటుడిగా వరుణ్‌ నన్ను ఎప్పుడూ ఫాలోకాలేదు. ముందు నుంచీ విభిన్న కథలు ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. మా కుటుంబ హీరోల్లో ఎవరికీ రాని ఇలాంటి అవకాశాలు వరుణ్‌కు వచ్చాయి. ఎయిర్‌ ఫోర్స్‌ పై టాలీవుడ్‌లో తెరకెక్కిన తొలి చిత్రమిదే. గతేడాది హాలీవుడ్‌ సినిమా ‘టాప్‌గన్‌’లోని విజువల్స్‌ చూసి ఇలాంటిది మనం తీయగలమా ? అనుకున్నా. ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ అదే స్థాయిలో ఉంది. టాలెంట్‌ ఒకరి సొత్తు కాదు’’ అని పేర్కొన్నారు.

Also Read : Nayanthara : నాకు 100 కోట్లు ఇచ్చిన ఆ హీరోతో యాక్ట్ చేయ్యను – నయనతార

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com