Operation Valentine: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రఫర్, వీఎఫ్‌ఎక్స్ స్పెషలిస్ట్ శక్తి ప్రతాప్ సింగ్ హడా తెరకెక్కించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ బై లింగ్యువల్ ప్రాజెక్ట్ లో వరుణ్ తేజ్(Varun Tej) ఫైటర్ పైలట్‌గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. ‘నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొంది భారత వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను తెరపై ఆవిష్కరించే విధంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 16న విడుదల కానుంది.
Operation Valentine – ఫస్ట్ స్ట్రైక్ పేరుతో టీజర్ విడుదల చేసిన చిత్ర యూనిట్
పైలట్ అర్జున్‌దేవ్ పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్‌గా మానుషి చిల్లర్ నటిస్తున్నారు. దీనితో ‘ఫస్ట్ స్ట్రైక్’ పేరుతో ఈ సినిమా టీజర్‌ను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘శత్రువులకు ఓ విషయం గుర్తుచేయాల్సిన సమయం వచ్చింది. మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్‌ది కూడా…’, ‘ఏం జరిగినా సరే చూసుకుందాం’ అంటూ టీజర్ లో వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్స్ కు మంచి స్పందన వస్తుంది. ‘దేశ వైమానిక దళ హీరోల ధైర్యసాహసాలు, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొనే సవాళ్ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు’ ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ వెల్లడించడంతో ‘ఆపరేషన్ వాలెంటైన్’పై అంచనాలు పెరిగిపోతున్నాయి.
Also Read : Anupama Parameswaran: అవకాశాల కోసం రూట్ మార్చిన అనుపమ ?