Oorellipota Mama : ప్రస్తుతం తెలుగు సినిమా చరిత్రకు సంబంధించి సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సీరీస్ ఆకట్టుకుంటున్నాయి. అద్భుతమైన కంటెంట్ తో అలరించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే చాలా వెబ్ సీరీస్ దుమ్ము రేపుతున్నాయి. ఓటీటీలో, యూట్యూబ్ లో టాప్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో , ఆలోచనలతో, భిన్నమైన పాత్రలతో, ట్రెండింగ్ లో ఉండేలా టైటిల్స్ , డైలాగులతో రిలీజ్ అవుతున్నాయి.
Oorellipota Mama Web Series Trending
షార్ట్ ఫిలింస్ సైతం ఆకట్టుకుంటున్నాయి. ఇదే క్రమంలో వచ్చిన వెబ్ సీరీస్ ఊరెళ్లి పోతా మామా(Oorellipota Mama). ఇప్పుడు ఎక్కువగా దీనిని చూస్తుండడం విశేషం. సూపర్ కాన్సప్ట్, అద్భుతమైన డైలాగులు, పంచులు, ప్రసాల మధ్య సాగే ఆసక్తికరమైన కథ. కథలు రాయడమే కాదు నటించిన జేడీవీ ప్రసాద్(JDV Prasad) ను అభినందించక తప్పదు.
ఊరులో అప్పులు చేసి తీర్చేందుకని హైదరాబాద్ వచ్చి కష్టపడే వ్యక్తి పాత్ర ప్రసాద్ ది. ఇందులో ముగ్గురు మహిళల మధ్య ఆసక్తికరమైన డైలాగులు. తనకు వ్యవసాయం అంటే అభిమానం. పని చేసి అప్పులు తీర్చేసి ఏదో ఒక రోజు పొలం పనులు చేసుకోవాలనేది ప్రసాద్ కోరిక.
ఇందులో జేడీవీ ప్రసాద్ , శ్రుతి రావు, ప్రవీణ్ కింథాలి, సుప్రియ, సోనియా బల్లా, చందు జేసీ, దాదల నదీప్, బాల, కార్తీక్ కిల్లి, శివ, అధ్విక, చందు చార్మ్స్ , అక్షయ్, చిన్నుగాడు కీలక పాత్రల్లో నటించారు. ఈ సీరీస్ ను వందన బండారు నిర్మించారు. ప్రవీణ్ కింతాలి దర్శకత్వం వహించారు. కథ రఘురామ్ రాయగా వికాస్ పత్తిపాక మ్యూజిక్ ఇచ్చారు.
Also Read : Sapthagiri-Pelli Kani Prasad Sensational :పెళ్లి కాని ప్రసాద్ ఫస్ట్ లుక్ రిలీజ్