Pushpa 2 : మరోసారి బన్నీ పుష్ప 2 నుంచి వీడియో లీక్..

ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ వీడియో లీక్ అయింది...

Hello Telugu - Pushpa 2

Pushpa 2 : ‘పుష్ప 2’ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమా అని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదేవిధంగా విడుదలైన అన్ని ఏరియాల్లో భారీ విజయాన్ని సాధించి కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, డైలాగ్స్, అల్లు అర్జున్ నటన ప్రేక్షకులను మెప్పించింది. దాంతో ఇప్పుడు పుష్ప 2 పై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సగంలోనే ఆగిపోయినట్లు మొన్నటివరకు రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తేలింది. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Pushpa 2 Updates

ఇప్పుడు ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ వీడియో లీక్ అయింది. ఓ యాక్షన్ సీన్ కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై అల్లు అర్జున్ అభిమానుఫైర్ అవుతున్నారు. ‘ పుష్ప 2(Pushpa 2)’ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, డాలీ ధనంజయ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో ఫోన్‌లు ఉపయోగించడం నిషేదించారు మేకర్స్. అయితే కొందరు దొంగతనంగా మొబైల్ ను సెట్స్ లోపలికి తీసుకెళ్లారు. క్లైమాక్స్‌ స్టేజ్‌ షూటింగ్‌ ను వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో ఫ్యాన్స్ పేజీల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే షూటింగ్ విషయంలో ‘పుష్ప 2(Pushpa 2)’ చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంది. అందుకే ఇప్పటి వరకు ఎలాంటి ఫోటోలు, వీడియోలు లీక్ కాలేదు. సెట్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ కావడం ఇదే తొలిసారి. ‘ పుష్ప 2’ సినిమా ఆగస్ట్ 15న విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ 6కి వాయిదా పడింది. ‘ పుష్ప’ విడుదలైన మూడేళ్ల తర్వాత రెండో భాగాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Also Read : Tiger Shroff : వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందులు పడుతున్న బాలీవుడ్ బడా నటుడు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com