Om Raut : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై ఎన్నో విమర్శలను అందుకుంది. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ యాక్టింగ్ ఆకట్టుకుంది.. మ్యూజిక్ పరంగానూ మెప్పించింది. కానీ రామాయణంలోని పాత్రలను డైరెక్టర్ ఓంరౌత్ చూపించిన తీరుపై మండిపడ్డారు సినీ విశ్లేషకులు. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లుక్‌తోపాటు డైలాగ్స్, మిగతా పాత్రల లుక్స్ తప్పుబడుతూ పలువురు కామెంట్స్ చేశారు. ఇప్పటికీ ఓంరౌత్(Om Raut) పనితీరుపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మాత్రం పాన్ ఇండియా మూవీ లవర్స్‌ను నిరాశపరిచింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం భారీ వసూళ్లు రాబట్టింది. ప్రభాస్ క్రేజ్‌తో ఊహించని కలెక్షన్స్ వసూలు చేసింది. అడియన్స్ అంచనాలు అందుకోకపోయినప్పటికీ రికార్డ్స్ మాత్రం సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా రిజల్ట్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు డైరెక్టర్ ఓంరౌత్.
Om Raut Comment
“ఇప్పుడు సోషల్ మీడియాలో ముక్కు, ముఖం తెలియనివాళ్లు చేసే కామెంట్స్.. విమర్శలను పట్టించుకోను.. ఇక ట్రోల్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు… ఒక సినిమా విషయంలో బాక్సాఫీస్ కలెక్షన్స్ మాత్రమే కీలకంగా తీసుకుంటారు. మా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచిగా ఆడింది. తొలిరోజే దేశవ్యాప్తంగా రూ.70 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది” అని ఓంరౌత్ అన్నారు.
ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. దీంతో మరోసారి ఓంరౌత్ పై నెటిజన్స్ విరుచుకుపడుతున్నారు. భారీ బడ్జెట్ ఖర్చు పెట్టినప్పటికీ సినిమాను మంచిగా తెరకెక్కించలేదని పలువురు కామెంట్స్ చేశారు. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ఆదిపురుష్(Adipurush). రామాయణాన్ని ఆధారంగా చేసుకుని డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం రూ.600 కోట్ల భారీ బడ్జె్ట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కృతిసనన్ సీత పాత్రలో నటించగా.. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు. గతేడాది జూన్ లో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ మూవీ విషయంలో డైరెక్టర్ ఓంరౌత్, డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ శుక్లాపై ఆగ్రహం వ్యక్తం చేశారు అడియన్స్.
Also Read : Deepika Padukone : 10 వేల కోట్లకు చేరువలో దీపికా పదుకొనె ఆస్తుల విలువ