Tamannaah : దేశంలో ఇప్పుడు ఆధ్యాత్మికతను ప్రతిబింబించే సినిమాలకు ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. వీటిని ఆధారంగా చేసుకుని మైథలాజికల్ మూవీస్ తెరకెక్కించేందుకు దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా గత ఏడాది రిలీజ్ అయిన నాగ్ అశ్విన్ తీసిన కల్కి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక రిషబ్ శెట్టి నటించిన కాంతారా గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఓదెల 2(Odela 2)పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దీనికి అశోక్ తేజ దర్శకత్వం వహించాడు. చిత్రానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది.
Tamannaah Bhatia Character
వచ్చే నెల ఏప్రిల్ 17న ముహూర్తం నిర్ణయించారు. ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు మూవీ మేకర్స్. ఇక ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah). ఏకంగా నాగ సాధువు పాత్రలో నటిస్తుండడం విశేషం. ఈ సినిమాకు సంబంధించి తాజాగా రిలీజ్ చేసిన టీజర్ కెవ్వు కేక అనిపించేలా ఉంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పకడ్బందీ కథ, అంతకు మించి ఉత్కంఠ రేపే సన్నివేశాలు, నటీ నటుల అసమాన ప్రదర్శన వెరసి సినిమాకు కొత్త అందాన్ని, మరింత బలాన్ని ఇచ్చేలా చేసింది. ప్రధానంగా దర్శకుడి ప్రతిభకు ఇది మచ్చు తునక అని చెప్పక తప్పదు.
ఈ సందర్బంగా ఓదెల 2 మూవీ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది తమన్నా భాటియా. తన సినీ కెరీర్ లో ఈ మూవీ స్పెషల్ గా నిలిచి పోతుందని చెప్పింది. ప్రతి హీరో హీరోయిన్ కు ఏదో ఒక సందర్బంలో ఇలాంటి పాత్రలు అరుదుగా లభిస్తాయని, ఇది తనకు దక్కిన బహుమానంగా తాను భావిస్తున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో దర్శకుడు అశోక్ తేజ మాత్రం ఓదెల 2 తప్పకుండా ప్రతి భారతీయుడిని తలుపు తట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా ట్రైలర్ ద్వారా తమ సత్తా ఏమిటో తెలిసి పోయిందంటూ కామెంట్ చేయడం విశేషం.
Also Read : Beauty Kiara Advani : కియారా రెమ్యూనరేషన్ లో కెవ్వు కేక