NTR Nara Lokesh : దివంగత ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని కేంద్ర సర్కార్ ఎన్టీఆర్ స్మారక నాణెం ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తెలుగు జాతికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
NTR Nara Lokesh Words
తెలుగు వాడిగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, అంతకుమించి నందమూరి తారక రామారావు మనవడిగా గర్విస్తున్నానని తెలిపారు. ఎన్టీఆర్ కథా నాయకుడు, ప్రజా సేవకుడు మాత్రమే కాదన్నారు. తెలుగు జాతిని ఒక్క తాటిపై నడిపించిన మహా నాయకుడు అని కొనియాడారు.
కోట్లాది హృదయాలలో నేటికి నిక్షిప్తమై ఎన్టీఆర్ ఉండి పోయారంటూ పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాబోయే తరాలకు స్పూర్తి దాయకంగా ఉందన్నారు నారా లోకేష్(Nara Lokesh). ఆయన భౌతికంగా లేక పోయినా కానీ ఎల్లప్పటికీ స్పూర్తిగా నిలుస్తారని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ నిజమైన శక పురుషుడు అని కొనియాడారు నారా లోకేష్.
ఎన్టీఆర్ శత జయంతిని చరిత్రలో నిలిచి పోయేలా ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ,కేంద్ర సర్కార్ కు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : NTR 100 RS Coin : ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల