Noor Malabika: అనుమానాస్పద రీతిలో బాలీవుడ్ నటి మృతి ! పట్టించుకోని కుటుంబ సభ్యులు !

అనుమానాస్పద రీతిలో బాలీవుడ్ నటి మృతి ! పట్టించుకోని కుటుంబ సభ్యులు !

Hello Telugu - Noor Malabika

Noor Malabika: ప్రముఖ బాలీవుడ్ నటి నూర్ మాళబిక (32) అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. ముంబయిలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్న ఈమె ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నూర్(Noor Malabika) ఫ్లాట్ నుండి దుర్వాసన రావడంతో… స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… కుళ్లిన స్థితిలో ఉన్న నూర్ బాడీ ను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే నూర్ మృతి చెందిన విషయం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినప్పటికీ… కనీసం ఈమెని చూడటానికి ఎవరూ రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనితో ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో ఈమె అంత్యక్రియలు నిర్వహించారు.

Noor Malabika…

అసోంకి చెందిన నూర్ మాళవిక… ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో పలు అడల్ట్ సిరీస్, సినిమాల్లో నటించింది. కానీ గతేడాది ‘ద ట్రయల్’ వెబ్ సిరీసులో నటించి మంచిగానే గుర్తింపు తెచ్చుకుంది. ఏమైందో ఏమో మరి ముంబయిలోని ఈమె ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. కానీ ఈమె బాడీ నుంచి దుర్వాసన రావడంతో అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారమిచ్చారు. వాళ్లు శవాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఇది ఆత్మహత్య అని అనుమానపడుతున్నారు. నూర్ చనిపోవడానికి రెండు వారాల ముందే కుటుంబ సభ్యులు… ముంబయిలోని ఈమె ఇంటికి వచ్చి వెళ్లారు. ఇప్పుడు ఈమె చనిపోయిన తర్వాత పోలీసులు వాళ్లకు ఫోన్ చేసి బాడీని తీసుకెళ్లమని చెబితే పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో గొడవ పడిన తర్వాతే నూర్ చనిపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.

Also Read : Vijay Sethupathi : పవన్ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని విజయం సాధించారు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com