Selvamani Roja : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి , ప్రముఖ నటి ఆర్కే రోజా కు బిగ్ షాక్ తగిలింది. ఆమె భర్త ప్రముఖ దర్శకుడు సెల్వమణి. ఆయన రోజాను పెళ్లి చేసుకున్నారు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా ఓ కేసులో మంత్రి రోజా భర్త సెల్వమణిపై కోర్టు సీరియస్ అయ్యింది.
Selvamani Roja Husband Issue
ఈ మేరకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఓ కేసులో ముకుంద్ చంద్ బోత్రా అనే సినిమా ఫైనాన్షియర్ 2016లో అరెస్ట్ అయ్యారు. ముకుంద్ కారణంగా తాను తీవ్ర ఇబ్బందులు పడ్డానంటూ ఆర్కే రోజా(Selvamani RK) భర్త సెల్వమణి ఓ ఛానల్ లో ప్రస్తావించారంటూ ఆరోపించారు.
సెల్వమణి తన గురించి మాట్లాడటం వల్ల తన వ్యక్తిగత ఇమేజ్ కు, జీవితానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని చంద్ బోత్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మరకు సెల్వమణి కామెంట్స్ కారణంగా తన పరువుకు భంగం కలిగిందంటూ కోర్టును ఆశ్రయించారు . దర్శకుడిపై కేసు దాఖలు చేశారు.
అనుకోకుండా చంద్ బోత్రా మృతి చెందారు. అయినా ఈ కేసు చివరి దాకా కొనసాగుతూ వచ్చింది కోర్టులో. బోత్రా మరణించినా వారి కుమారుడు గగన్ బోత్రా కేసును కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ పరువు నష్టం కేసు విచారణ సోమవారం జరిగింది. ఈ కేసుకు సంబంధించి సెల్వమణి హాజరు కాక పోవడంతో కోర్టు సీరియస్ అయ్యింది. వెంటనే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు.
Also Read : Gunturu Kaaram : త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీపై ఫోకస్