Saif : బాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధించి కలకలం రేపింది నటుడు సైఫ్ అలీ ఖాన్(Saif) పై జరిగిన దాడి. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. ఇప్పటికే మరో అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ ను బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసింది. ఏదో ఒక రోజు చంపేస్తామంటూ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తనకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది.
Hero Saif Ali Khan Comment
ఈ తరుణంలో ఉన్నట్టుండి న్యూ ఇయర్ వేడుకలలో స్విట్జర్లాండ్ లో పాల్గొని తిరిగి తన కుటుంబంతో సహా వచ్చిన సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ఈ ఘటనలో తను ఆరు కత్తిపోట్లకు గురయ్యాడు. వెంటనే తనయుడు తనను ఆటోలో ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తీసుకు వెళ్లడంతో ప్రాణ గండం తప్పింది.
వెన్నెముకకు బలమైన గాయం కావడంతో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ముంబై స్పెషల్ జోన్ 9కు చెందిన డీసీపీ దీక్షిత్ ఈ కేసును పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కొందరిని విచారిస్తున్నట్లు తెలిపారు.
మరో వైపు సైఫ్ దాడి వెనుక ముంబై అండర్ వరల్డ్ ప్రమేయం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై తీవ్రంగా స్పందించారు మంత్రి యోగేష్. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 10 స్పెషల్ టీమ్స్ గాలిస్తున్నాయని, సైఫ్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ వార్త పూర్తిగా అబద్దం అంటూ కొట్టి పారేశారు.
Also Read : Hero Chiranjeevi Comment : థమన్ ఆవేదన చిరంజీవి ఆలంబన