Nivetha Thomas: పెళ్లి రూమర్స్ పై నివేదా థామస్‌ ఫన్నీ కామెంట్స్‌ !

పెళ్లి రూమర్స్ పై నివేదా థామస్‌ ఫన్నీ కామెంట్స్‌ !

Hello Telugu - Nivetha Thomas

Nivetha Thomas: టాలీవుడ్ లో పెళ్లిళ్ళ సీజన్ నడుస్తోంది. సీనియర్ నటీమణులు ఒక్కొక్కరుగా పెళ్లిపీటలెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా పెళ్లి పీటలెక్కని సీనియర్లకు… ప్రతీ సినిమా ఫంక్షన్ లో ఎదురయ్యే మొదటి ప్రశ్న పెళ్ళి ఎప్పుడని. తాజాగా నివేదా థామస్(Nivetha Thomas) కు ఇలాంటి ప్రశ్నే ఎదురయింది. దీనితో తన పెళ్లంటూ జరిగిన ప్రచారంపై నటి నివేదా థామస్‌ స్పందించారు. తన కొత్త సినిమా ‘35 చిన్న కథ కాదు’ టీజర్‌ విడుదల వేడుకలో పెళ్లి రూమర్స్ పై ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Nivetha Thomas Comment

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘35 చిన్న కథ కాదు’ సినిమా ప్రచారంలో భాగంగా సోషల్‌ మీడియాలో నేను ఓ ఫొటో పోస్ట్‌ చేశా. దాన్ని చూసి చాలామంది నాకు పెళ్లి కానుందని భావించారు. దానిపై వార్తలు రాగా మా అమ్మ నాకు ఆ ఫొటో పంపారు. ‘అవునా అమ్మా… మీరెప్పుడు నా కోసం అబ్బాయిని చూశారు’ అని అడిగా’’ అని పేర్కొన్నారు. ఆ చిత్రంలో తన భర్తగా నటించిన విశ్వదేవ్‌, తన కుమారులుగా నటించిన వారిని ఉద్దేశిస్తూ… ‘నాకు పెళ్లైంది. ఈయనే నా భర్త. వీళ్లే నా ఇద్దరు పిల్లలు అరుణ్‌, వరుణ్‌’ అని సరదాగా పేర్కొన్నారు.

ఈ సినిమాలో తల్లిగా నటించడం సవాలు విసిరిందని తెలిపారు. టీజర్‌తో చిత్ర కథాంశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశామన్నారు. బాలనటులు తనను మేడమనో, అక్క అనో కాకుండా అమ్మ అనే పిలిచారంటూ ఆనందం వ్యక్తం చేశారు. తిరుపతి నేపథ్యంలో జరిగే కథతో దర్శకుడు నందకిశోర్‌ ఇమాని ఈ సినిమా తెరకెక్కించారు. హీరో రానా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.

Also Read : Hero Raj Tarun : హీరో రాజ్ తరుణ్ పై తన ప్రేయసి కీలక ఆరోపణలు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com