ప్రముఖ నటి నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనను ఓ తమిళ నటుడు వేధింపులకు గురి చేశాడంటూ వస్తున్న వార్తలను ఖండించింది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని కోరింది ఈ ముద్దుగుమ్మ. ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారో తనకు తెలియదని పేర్కొంది నిత్యా మీనన్.
తాను ఎవరికీ అధికారికంగా ఇంటర్వ్యూ లేదని స్పష్టం చేసింది. తనకు తెలిసీ ఎవరితో మాట్లాడలేదని, తన పర్మిషన్ లేకుండా ఎవరూ తనను వేధింపులకు గురి చేసే ప్రసక్తి లేదని పేర్కొంది నిత్యా మీనన్. తాను ఎవరి పట్ల ప్రేమగా ఉండడం కానీ, అసభ్యకరంగా ప్రవర్తించడం అంటూ ఉండదని తెలిపింది.
ఈ సందర్బంగా తనపై వచ్చిన వేధింపుల గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తాను తమిళ చిత్ర పరిశ్రమలో అసౌకర్యంగా ఫీల్ అయ్యానని చెప్పినట్లు వచ్చిన ప్రచారం పూర్తిగా ఒట్టిదేనని కుండ బద్దలు కొట్టింది.
తాను కంటెంట్ కు ప్రయారిటీ ఇస్తున్నానని, కేవలం తనకు నచ్చితేనే ఎంపిక చేసుకుంటున్నానని, లేక పోతే మౌనంగా ఉంటున్నానని నిత్యా మీనన్ తెలిపింది. ప్రత్యేకించి రియాల్టీ షోస్ కు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నట్లు చెప్పింది నటి.