Robinhood : చాన్నాళ్ల గ్యాప్ తర్వాత నితిన్ రెడ్డి నటించిన చిత్రం రాబిన్ హుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ కు చెందిన రెండు సినిమాలు పోటా పోటీగా రిలీజ్ అయ్యాయి. సితార బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మించిన మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ కూడా విడుదల కావడంతో పోటీ నెలకొంది. పుష్ప-2 చిత్రంతో దేశ వ్యాప్తంగా తమ వైపు చూసేలా చేసిన మైత్రీ మూవీ మేకర్స్ నుంచి రాబిన్ హుడ్ రావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆశించిన దానికంటే ఎక్కువగా ఈ సినిమా ప్రమోషన్స్ చేశారు మూవీ మేకర్స్.
Robinhood Movie Collections
దర్శకుడు వెంకీ కుడుముల రాబిన్ హుడ్(Robinhood) ను పూర్తిగా హాస్యం, వినోదం, సస్పెన్స్ తో మేళవించి తెరకెక్కించాడు. ఇక తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. మూవీకి సాంగ్స్ , మ్యూజిక్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాబిన్ హుడ్ పట్ల మిశ్రమ స్పందన వచ్చింది. మరో వైపు మ్యాడ్ -2 దూసుకు పోతోంది. ఇక సినిమా విషయానికి వస్తే శ్రీలీల అదనపు ఆకర్షణగా నిలిచింది.
అనాథాశ్రమంలో పెరిగే అనాథ రామ్ కథను చెబుతుంది. పిల్లలకు సహాయం చేయడానికి, రామ్ రాబిన్ హుడ్ తత్వాన్ని అవలంబిస్తాడు. పేదలకు ఇవ్వడానికి ధనవంతుల నుండి దొంగిలించడం. కథ ముగుస్తున్న కొద్దీ, రామ్ సవాళ్లు , ఆశ్చర్యాలతో నిండిన మిషన్‌లో పాల్గొంటాడు. ఇతరులకు సహాయం చేయడానికి ఒక హీరో దొంగగా మారడం అనే ప్రాథమిక ఆలోచన కొత్తది కానప్పటికీ, ఈ చిత్రంలో మలుపులు, హాస్య క్షణాలు ఉన్నాయి, ఇవి విషయాలను ఆసక్తికరంగా ఉంచుతాయి. నితిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ల మధ్య కెమిస్ట్రీ ఫస్ట్ హాఫ్ లో హాస్యాన్ని తెస్తుంది, సెకండ్ హాఫ్ యాక్షన్, సస్పెన్స్ తో మరింత సీరియస్ గా మారుతుంది.
Also Read : Vishnu Priya Shocking :నటి విష్ణుప్రియకు హైకోర్టులో చుక్కెదురు