Niharika : నిహారిక చిన్నప్పుడు అంత పెద్ద తప్పు చేసిందా?

చిన్నప్పుడు తెలియక అలా చేశా : నిహారిక

Hello telugu-Niharika

Niharika: టాలీవుడ్ లోని చాలా మంది స్టార్లు తమ వారసులను పరిచయం చేశారు. కానీ అందులో కొంత మంది మాత్రమే తమ కూతుళ్లను సీని రంగంలోకి తీసుకచ్చారు. అయితే అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో మెగా డాటర్ నిహరిక. ఈ అమ్మడుకు సంబంధించిన ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా నిహారిక ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. మెగా డాటర్ ఈ మధ్యనే ఒక సినిమాని ప్రొడ్యూస్ చెస్తున్నా విషయం తేలిసిందే.అయితే ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు తన అన్నా వదినలతో చేయించిందని రీసెంట్ గా ఇంటర్వ్యూలో చెప్పింది.

Niharika :

ఈ క్రమంలో నిహారికకు ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే..అందులో యాంకర్ నిహారిక(Niharika) ని ఓ ప్రశ్న అడుగుతూ.. మీరు మొదటిసారి మేకప్ వేసుకున్నది ఎప్పుడో చెప్పగలరా అని అడగగా నేను ఢీ షో కోసం ఫస్ట్ టైం మేకప్ వేసుకున్నాను అంటూ చెప్పింది. అలాగే చిన్నప్పుడు ఏదైనా విలువైన వస్తువులను మీరు పోగొట్టుకున్నారా అని యాంకర్ అడగగా.. అవును నేను చిన్నప్పుడు ఎన్నో విలువైన వస్తువులను పోగొట్టుకున్నాను. మరీ ముఖ్యంగా మా అమ్మ నాకు ఎన్నో విలువైన బంగారు నగలను ప్రేమతో చేయించి వేసేది.కానీ ఆ నగల విలువ తెలియక నేను ఎన్నోసార్లు వాటిని పోగొట్టుకున్నాను. నేను చిన్నప్పుడు పోగొట్టిన ఆ బంగారంతో ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవచ్చు అంతా విలువ గల బంగారాన్ని పోగొట్టాను అంటూ నిహారిక చెప్పింది. ప్రస్తుతం నిహారిక మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఇది చూసిన నెటిజన్స్, నిహారిక చిన్నప్పుడు తెలియక అంత పెద్ద తప్పుర చేసిందా, దీని వలన నాగబాబుకు ఎంత నష్టం వచ్చిందో అంటూ ముచ్చటిస్తున్నారు.

Also Read : Aadikeshava : ఆదికేశవ ట్రైలర్ రిలీజ్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com