Niharika Konidela: విడాకుల అనంతరం మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) క్రియేటివ్ రంగంలో మరింత బిజీ అయింది. హీరోయిన్ గా రీ ఎంట్రీ సిద్ధమవుతూనే మరోవైపు యాంకర్ గానూ ఓ షో చేస్తుంది. నిర్మాతగాను మారి సినిమాలు, వెబ్ సిరీస్లను నిర్మిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతున్న పట్టించుకోకుండా తనకు నచ్చిన పనిని చేసుకుంటూ ముందుకెళ్తుంది. అయినా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే ! అందులో మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దాంతో ఆల్రెడీ ప్రేమలో పడిందనే గాసిప్లు మొదలయ్యాయి. నిహారిక అవన్నీ విని ఊరుకుంది కానీ ఎలాంటి స్పందన లేదు.
Niharika Konidela Post Viral
అయితే తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఓ ఫొటో మరోసారి ఆమె పెళ్లిపై చర్చకు దారి తీసింది. ఆ ఫొటోలో ఓ ఏనుగుల జంట రెండు ముఖాలను దగ్గరగా పెట్టుకొని ప్రేమగా చూసుకుంటూ ఉంటాయి. ఆ ఫోటోని నిహారిక ఇన్ స్ట్టాలో షేర్ చేస్తూ… రెడ్ హార్ట్ సింబల్ పెట్టింది. అది చూసిన వారంత నిహారిక మరోసారి ప్రేమలో పడిందని… అందుకే ఇలాంటి పోస్టులు పెడుతుందని చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతంలో సోషల్ మీడియాలో నిహారిక పోస్ట్ పైనే చర్చ జరుగుతోంది. అయితే నిహారికలో మళ్లీ ప్రేమలో పడలేదని, ప్రస్తుతానికి ఆమె ఫోకస్ అంతా కెరీర్ పైనే ఉందని సన్నిహితులు అంటున్నారు.
Also Read : Bellamkonda Sreenivas : యాక్షన్ ఓరియెంటెడ్ కంటెంట్ తో తెరపైకి వస్తున్న అల్లుడు శ్రీను