Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. పెళ్ళి తరువాత సినిమాలకు దూరమైన నిహారిక… భర్తతో విడాకుల తరువాత వెబ్ సిరీస్ తో ఓటీటీ ఫ్లాట్ ఫాంలో మెరిసింది. తాజాగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడుతోంది. ఈ నేపథ్యంలో “మెడ్రాస్ కారన్” అనే సినిమాలో నటిస్తోంది. వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళ హీరో షాన్ నిగమ్, కలైయరసన్, నిహారిక, ఐశ్వర్య దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన షూటింగ్ లో నిహారిక(Niharika Konidela) పాల్గొంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తో నిహారిక ఫోటోలు దిగుతూ సందడి చేసింది. దీనితో సినిమాల్లోకి నిహారిక రీ ఎంట్రీ అంటూ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Niharika Konidela Movie Updates
ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు పాన్‌రామ్ మాట్లాడుతూ… “దర్శకుడు వాలిమోహన్ దాస్ నాకు మంచి మిత్రుడు. ప్రతి సినిమా షూటింగ్ కు ముందు స్క్రీన్ ప్లే గురించి మేము చర్చించుకుంటాము. వాలి మంచి ప్రతిభావంతుడని… షాన్ నిగమ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. నటుడు కలైయరసన్ కూడా తనకు మంచి స్నేహితుడని అన్నారు. ఈ టీమ్ కలిసి చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. మెడ్రాస్ కారన్ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని దర్శకుడు పాన్‌రామ్ అన్నారు. మెడ్రాస్ కారన్ మంచి యాక్షన్, డ్రామా కథా చిత్రంగా ఉంటుందని చిత్ర దర్శకుడు వాలిమోహన్‌దాస్ పే ర్కొన్నారు. ఈ సినిమా షూటింగ్ చైన్నె, మదురై, కొచ్చి ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
Also Read : Rashmika Mandanna: ఫోర్బ్స్ ఇండియా జాబితాలో రష్మిక !