Nidhhi Agerwal : చాలా రోజులకు నెటిజన్ల ప్రశ్నల పై స్పందించిన నిధి అగర్వాల్

చాలా గ్యాప్ తర్వాత ‘ఆస్క్ నిధి’ పేరుతో తాజాగా ఆమె నెటిజన్లతో ఛాట్ చేసింది...

Hello Telugu - Nidhhi agerwal

Nidhhi Agerwal : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’, రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘ది రాజా సాబ్’ వంటి స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తోంది గ్లామర్ డాల్ నిధి అగర్వాల్(Nidhhi Agerwal). ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత సరైన హిట్ లేని నిధికి ఈ రెండు సినిమాలు ఎంతో కీలకం కానున్నాయి. ఆమె కూడా ఈ రెండు సినిమాలపై ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు నెటిజన్లతో ముచ్చటింగే ఈ భామ.. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలోనూ అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. చాలా గ్యాప్ తర్వాత ‘ఆస్క్ నిధి’ పేరుతో తాజాగా ఆమె నెటిజన్లతో ఛాట్ చేసింది. ఈ చిట్ ఛాట్‌లో పర్సనల్, కెరీర్ విషయాలపై నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆమె ఎంతో ఆసక్తికరంగా సమాధానాలు చెప్పుకొచ్చింది. మూవీ లవర్స్, అభిమానులు నిధి అగర్వాల్‌కు ప్రశ్నలు పంపించేందుకు సోషల్ మీడియాలో ఆసక్తి కనబరిచారు.

Nidhhi Agerwal Comment

ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న రాజా సాబ్ సినిమా సెట్‌లో ఎంతో సరదాగా పనిచేశామని, ఈ మూవీ టీమ్‌లో ఎంతో డెడికేషన్ ఉందని ‘ది రాజా సాబ్’ మూవీ గురించి నెటిజన్ అడిగిన ప్రశ్నకు నిధి అగర్వాల్(Nidhhi Agerwal) సమాధానమిచ్చింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో రీసెంట్‌గా ఓ సెల్ఫీ తీసుకున్నానని, త్వరలోనే ఆ సెల్ఫీ పోస్ట్ చేస్తానని నిధి ఓ ప్రశ్నకు చెప్పుకొచ్చింది. మీకు తెలుగు వచ్చా అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నిధి సూటిగా సమాధానమిచ్చింది.

తనకు తెలుగు బాగా మాట్లాడటం వచ్చు అని, కేవలం ‘అందరికీ నమస్కారం’ అనే బ్యాచ్ కాదని ఫన్నీగా ఆన్సర్ చెప్పింది. పీఆర్ మెయింటేన్ చేయడం తనకు కష్టమైన పనిగా అనిపిస్తుందని పేర్కొంది. రాబోయే నూతన సంవత్సరంలో తను నటించిన రెండు సినిమాలు ‘ది రాజా సాబ్’, ‘హరి హర వీరమల్లు’ విడుదలవుతాయని, ఆ రెండు చిత్రాలతో నాయికగా ప్రేక్షకులకు మరింత చేరువవుతానని ఆశాభావం వ్యక్తం చేసింది నిధి అగర్వాల్. అంతేనా.. ఈ రెండు చిత్రాలతో పాటు మరో సర్‌ప్రైజింగ్ మూవీ కూడా ఉందని.. త్వరలోనే ఆ మూవీ ప్రకటన వస్తుందని ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేసిందీ ఇస్మార్ట్ బ్యూటీ.

Also Read : Chiranjeevi-Srikanth Odela : శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఓ మంచి వింటేజ్ కమ్ బ్యాక్ ఇస్తున్న చిరు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com