ప్రేమ వ్యవహారం పక్కనపెట్టి కెరీర్ మీదే దృష్టి అంటోన్న నిధీ అగర్వాల్ !
హీరోయిన్ నిధీ అగర్వాల్ అగర్వాల్ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే ! ఒక నటుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అయితే తాజాగా ప్రేమ సీన రివర్స్ అయిందట. ప్రియుడి గురించి కొన్ని చేదు సంఘటనలు తెలియడంతో అతనితో బ్రేకప్ చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్తల నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆమె ప్రేమ, పెళ్లి అనే విషయాలను పక్కన పెట్టి నటనపై పూర్తిగా దృష్టి సారించాలని నిధీ అగర్వాల్ నిర్ణయించుకున్నారని తెలిసింది. అయితే ఆ ప్రియుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. బాలీవుడ్‌కి చెందిన వ్యక్తి అనే చెబుతున్నారు.
Nidhhi Agerwal Movies
మున్నా మైఖేల్ హిందీ చిత్రం ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు నిధీ. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టి… ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ నటిగా నిధీ అగర్వాల్(Nidhhi Agerwal)కు గుర్తింపు అయితే వచ్చింది. ఇస్టార్ట్ శంకర్ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటించి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత కూడా పలు అవకాశాలు అనుకున్నప్పటికీ ఏదీ విజయం సాధింలేదు. తమిళంలో జయం రవికి జంటగా ‘భూమి’ అనే చిత్రంతో పరిచయమయ్యారు. ఓటీటీలో విడుదలైనీ చిత్రంతో ఆమె కెరీర్‌కు ఒరిగిందేమీ లేదు. తర్వాత ఈశ్వరన్ కూడా అలాంటి ఫలితమే ఇచ్చింది. ఉదయననిధి స్టాలిన్ తో కలిసి ‘కలకతలైవన్’ చిత్రంలో కనిపించారు. నిధికి అందం, అభినయం ఉన్నప్పటికీ ఎక్కడో కాలం కలిసి రావడం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తోంది. తాజాగా ప్రభాస్ సరసన నటించే అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read : Sreeja Konidela : కొత్త వ్యాపారం మొదలు పెట్టిన చిరంజీవి చిన్నకూతురు శ్రీజ