New Movies in OTT: తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద సంక్రాంతి సినిమాల సందడి దాదాపు ముగిసింది. పండుగ సెలవులు పూర్తికాబోతుండటంతో ఎవరికి వారు తమ పనుల్లో బిజీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సినిమాలకు బాక్సాఫీసు వద్ద కాస్తా రష్ తగ్గిందనే చెప్పుకోవాలి. సంక్రాంతి పండుగ మరియు సెలవులను క్యాష్ చేసుకోవడానికి తమ సినిమాలను విడుదల చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థలు ఈ సీజన్ ను ఎక్కువగా ఎంచుకుంటాయి.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ లో హనుమాన్, గుంటూరుకారం, సైంధవ్, నా స్వామిరంగా నాలుగు పెద్ద సినిమాలు బాక్సాఫీసు వద్ద తలపడ్డాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జునతో పాటు హనుమాన్ సినిమాతో యువ హీరో తేజ సజ్జా పోటీ పడ్డాడు. అయితే ఈ పోటీలో అగ్రహీరోలపై యువ హీరో పై చేయి సాధించాడనే చెప్పుకోవాలి. ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్ సూపర్ హిట్ అయిందని చెప్పుకోవాలి.
New Movies in OTT Updates
అయితే థియేటర్ల వద్ద సంక్రాంతి సందడి ముగియడంతో ఇప్పుడు ఓటీటీలో(OTT) సంక్రాంతి సినిమాల సందడి మొదలైయింది. సంక్రాంతి సెలవులను క్యాష్ చేసుకోవడానికి ఓటీటీ ఫ్లాట్ ఫాంలు సైతం పెద్ద ప్లాన్ వేసాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 సినిమాలు ఈ వారంలో అన్ని ప్రముఖ ఓటీటీ(OTT) ఫ్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ కు సిద్ధమౌతున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్, జీ5, ఆహా, సోనీలివ్, జియో సినిమా వంటి పలు ఓటీటీల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సుమారు 45 సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
ఏ ఓటీటీల్లో ఏ చిత్రాలు రాబోతున్నాయి ?
ఈ వారం ఓటీటీ(OTT)ల్లో రిలీజయ్యే మూవీస్ లిస్ట్ (జనవరి 15 నుంచి 21 వరకు)
హాట్స్టార్(Hot star)
జో (తమిళ మూవీ) – జనవరి 15
ల్యూక్ గుయాన్స్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 15
డెత్ అండ్ అదర్ డీటైల్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 16
ఏ షాప్ ఫర్ కిల్లర్స్ (కొరియన్ సిరీస్) – జనవరి 17
ఇట్ వజ్ ఆల్వేస్ మీ (స్పానిష్ సిరీస్) – జనవరి 17
బ్రాన్: ద ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19
కులీన్ రూనీ: ద రియల్ వగ్తా స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19
క్రిస్టోబల్ బలన్సియా (స్పానిష్ సిరీస్) – జనవరి 19
ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (తెలుగు సినిమా) – జనవరి 19
స్నేక్స్ SOS: గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 20
అమెజాన్ ప్రైమ్
నో యాక్టివిటీ (ఇటాలియన్ సిరీస్) – జనవరి 18
ఫిలిప్స్ (మలయాళ సినిమా) – జనవరి 19
హజ్బిన్ హోటల్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19
ఇండియన్ పోలీస్ ఫోర్స్ (హిందీ సిరీస్) – జనవరి 19
లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19
జొర్రో (స్పానిష్ సిరీస్) – జనవరి 19
నెట్ఫ్లిక్స్(Netflix)
మబోర్షి (జపనీస్ సినిమా) – జనవరి 15
రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ సిరీస్) – జనవరి 15
డస్టి స్లే: వర్కిన్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 16
అమెరికన్ నైట్మేర్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 17
ఎండ్ ఆఫ్ ద లైన్ (పోర్చుగీస్ సిరీస్) – జనవరి 17
ఫ్రమ్ ద యాసెస్ (అరబిక్ చిత్రం) – జనవరి 18
కుబ్రా (టర్కిష్ సిరీస్) – జనవరి 18
మేరీ మెన్ 3 (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 18
ప్రిమ్బాన్ (ఇండోనేసియన్ మూవీ) – జనవరి 18
రచిద్ బదౌరి (ఫ్రెంచ్ చిత్రం) – జనవరి 18
ఫుల్ సర్కిల్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 19
లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ U.S: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19
మి సోల్ డాడ్ టియన్ అలాస్ (స్పానిష్ సినిమా) – జనవరి 19
సిక్స్ టీ మినిట్స్ (జర్మన్ మూవీ) – జనవరి 19
ద బెక్తెడ్ (కొరియన్ సిరీస్) – జనవరి 19
ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 19
ద కిచెన్ (ఇంగ్లీష్ చిత్రం) – జనవరి 19
కేప్టివేటింగ్ ద కింగ్ (కొరియన్ సిరీస్) – జనవరి 20
జియో సినిమా
బెల్గ్రేవియా: ద నెక్స్ట్ చాప్టర్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 15
ట్రూ డిటెక్టివ్ సీజన్ 4: నైట్ కంట్రీ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 15
బ్లూ బీటల్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 18
చికాగో ఫైర్: సీజన్ 12 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 18
లా & ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ సీజన్ 25 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 19
బుక్ మై షో
అసైడ్ (ఫ్రెంచ్ సినిమా) – జనవరి 15
ఒడవుమ్ ముడియాదు ఒలియవుమ్ ముడియాదు (తమిళ మూవీ) – జనవరి 19
ఆల్ ఫన్ అండ్ గేమ్స్ (ఇంగ్లీష్ చిత్రం) – జనవరి 20
సోనీ లివ్
వేర్ ద క్రా డాడ్స్ సింగ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) – జనవరి 16
యూట్యూబ్
ద మార్వెల్స్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 17
ముబీ
ఫాలెన్ లీవ్స్ (ఫిన్నిష్ సినిమా) – జనవరి 19
Also Read : Singer KS Chitra: సింగర్ చిత్రపై ఓ వర్గం నెటిజన్ల దాడి !