Sudigali Sudheer: రష్మితో సుడిగాలి సుధీర్ సినిమా ?

రష్మితో సుడిగాలి సుధీర్ సినిమా ?

Hellotelugu-Sudigali Sudheer

Sudigali Sudheer : టెలివిజన్ స్క్రీన్ పై హిట్ పెయిర్ గా గుర్తింపు పొందడమే కాకుండా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న జంట సుడిగాలి సుధీర్- రష్మి గౌతమ్. మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లోని జబర్ధస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. వీరిద్ధరి సాన్నిహిత్యంపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. పెళ్ళి చేసుకోబోతున్నారు అనే రూమర్లు కూడా వచ్చాయి. మరోవైపు సుధీర్, రష్మి ఇద్దరూ వేరువేరుగా పలు సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీనితో వీరిద్దరి జోడీ వెండితెరపై ఎప్పుడు కనిపిస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

షాడో మీడియా ప్రొడక్షన్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వర్లు కాటూరి నిర్మాతలుగా అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) తాజాగా నటించిన చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’. సుడిగాలి సుధీర్ సరసన డాలీషా నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో హైదరబాద్ లో నిర్వహించిన ‘కాలింగ్‌ సహస్ర’ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సుధీర్… రష్మితో సినిమాపై ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు.

Sudigali Sudheer – కథ దొరికితే మేం సిద్ధం

రష్మిను హీరోయిన్‌గా సినిమా ఎప్పుడు చేస్తారని సుధీర్ ను సినిమా విలేఖరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘నేను, రష్మి ఇద్దరం కథలు వింటున్నాం. మా ఇద్దరికీ కామన్‌గా నచ్చిన కథ ఇప్పటి వరకు దొరకలేదు. ఒకవేళ అలాంటిది దొరికితే కచ్చితంగా ఇద్దరం కలిసి నటిస్తాం. ఇద్దరం కలిసి సినిమా చేయాలనే ప్రపోజల్ అయితే మాత్రం ఉంది’ అని అన్నారు. దీనితో సుడిగాలి సుధీర్-రష్మి గౌతమ్ జంటను వెండితెరపై చూడటానికి ఎదురుచూస్తున్న అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Sampoornesh Babu: ఓటీటీలోకి సంపూర్ణేశ్ సినిమా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com