Kiara Advani : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ కు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే బిగ్ ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. కానీ.. ఈ ఈవెంట్ లలో ఎక్కడ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani) కనిపించలేదు. దీంతో బడా హీరోల సినిమాల్లో ఫిమేల్ లీడ్స్ పాత్ర మరోసారి చర్చనీయంశమైంది. వాస్తవంగా ఈ సినిమాలో కియారా రోల్ ఏంటని విమర్శలు చేస్తున్నారు. గత నెలలో అమెరికాలోని డల్లాస్ లో జరిగిన భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కియరా కనిపించలేదు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు కూడా రాలేదు.
ఈ నేపథ్యంలోనే శనివారం ఏపీలో జరగనున్న భారీ ఫంక్షన్ కు ఆమె హాజరవుతారా అనే ప్రశ్న ఎదురవుతోంది. కొందరు ఏకంగా కియారా(Kiara Advani) కేవలం పాటల కోసమే.. సినిమాలో ఆమె పాత్ర గొప్పగా ఏమి ఉండదని విమర్శిస్తున్నారు. అయితే నార్త్ లో జరగనున్న లిమిటెడ్ ప్రమోషనల్ షోస్ లో మాత్రం ఆమె చరణ్ తో కలిసి కనిపించే అవకాశముంది. ఇది రామ్ చరణ్ తో కియారకు రెండో సినిమా. మొదట నటించిన బోయపాటి శ్రీను ‘వినయ విధేయ రామ’ సినిమా తీవ్ర నిరాశపరిచిన విషయం తెలిసిందే.
Kiara Advani Comment
గేమ్ ఛేంజర్ ను ఎస్‌వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో ప్రొడ్యూస్ చేస్తుండగా.. హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సరిగమ ఆడియో పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. గేమ్ చేంజర్ చిత్రంలో రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించనున్నారు. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించగా.. ఎస్.యు.వెంకటేశన్, వివేక్ రైటర్స్‌గా వర్క్ చేశారు. ఎస్.తిరుణ్ణావుక్కరసు సినిమాటోగ్రఫీ, ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు.యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా అన్బరివు, డాన్స్ డైరెక్టర్‌గా ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వర్క్ చేస్తున్నారు. రామ్ జోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్ పాటలను రాశారు.
Also Read : Meenakshi Chaudhary : తన ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మీనాక్షి చౌదరి