బాలీవుడ్ లో సంచలనం చోటు చేసుకుంది. ఇప్పటికే పేరొందిన నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందింది యష్ రాజ్ ఫిలిమ్స్ . ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించింది. నాణ్యవంతమైన , ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచేలా మూవీస్ తీసుకు వస్తోంది యష్ రాజ్ ఫిలిమ్స్.
భారతీయ సినీ జగత్తులో సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, దిల్ తో పాగల్ హై, చక్ దే ఇండియా, ధూమ్ , ఏక్ థా టైగర్ , సుల్తాన్ ఉన్నాయి.
యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ దిగ్గజమైన నెట్ ఫ్లిక్స్ తో చేతులు కలిపింది. రెండూ కలిసి ఇక నుంచి పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నెట్ ఫ్లిక్స్ ఇండియా వెల్లడించింది.
ఇరు సంస్థలకు సంబంధించి ఒప్పందంలో భాగంగా ది రైల్వే మెన్ , మహారాజ్ కొత్త ప్రాజెక్టులను ప్రకటించాయి. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్. మాధవన్ ది రైల్వే మెన్ వెబ్ సీరీస్ రానుంది. శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్ఆనడు. మహారాజ్ కు సిద్దార్థ్ మల్హోత్రా డైరెక్షన్ లో వస్తుందని తెలిపాయి.