Thandel : గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణ సారథ్యంలో చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ చిత్రం ఆశించిన దానికంటే సక్సెస్ అయ్యింది. రూ. 50 కోట్ల బడ్జెట్ తో దీనిని తెరకెక్కించారు. నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ మూవీ బిగ్ సక్సెస్ గా నిలిచింది. రూ. 150 కోట్లకు పైగా వసూలు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. దేశీయ పరంగా కంటే ఓవర్సీస్ లో తండేల్(Thandel) చిత్రం ఎక్కువగా కలెక్షన్స్ వచ్చినట్లు టాక్.
Thandel OTT..
అక్కినేని నాగ చైతన్య, నేచురల్ నటి సాయి పల్లవి కలిసి నటించిన తండేల్ ఓ దృశ్య కావ్యంగా మలిచాడు దర్శకుడు. ఇక శ్రీమణి పాటలు, రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, పాటలు ఓ రేంజ్ కు తీసుకు వెళ్లేలా చేశాయి. దీంతో తండేల్ మూవీ కోసం జనం ఎగబడటం ఆసక్తిని రేపింది. ఇదిలా ఉండగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు పలు సంస్థలు పోటీ పడ్డాయి.
చివరకు నెట్ ఫ్లిక్స్ తండేల్ చిత్రాన్ని స్వంతం చేసుకున్నట్లు టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఒప్పందం కూడా అయి పోయిందని, వచ్చే నెల మార్చి 6 లేదా 7వ తేదీలలో తండేల్ స్ట్రీమింగ్ కానుంది. కాగా నెట్ ఫ్లిక్స్ కానీ ఇటు గీతా ఆర్ట్స్ కానీ అధికారికంగా వెల్లడించ లేదు.
Also Read : Beauty Samantha Despair : ఒంటరితనం చాలా బాధకరం