Court : నటుడు నాని నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం కోర్ట్. ప్రియదర్శి , శివాజీ, రోహిణి , హర్ష వర్దన్ తో కొత్త దర్శకుడు తీసిన ఈ మూవీ ఎవరూ ఊహించని రీతిలో సక్సెస్ సాధించింది. భారీ ఎత్తున ఆదరణ లభిస్తుండడంతో కలెక్షన్లు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే రూ. 20 కోట్లకు పైగా కోర్టు(Court) వసూలు సాధించింది. సినీ వర్గాలను , విమర్శకులను సైతం మెప్పించేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ప్రత్యేకించి ఈ చిత్రం ఫోక్సో చట్టం గురించి ఫోకస్ పెట్టాడు.
Court Movie OTT Updates
ఈ చట్టం ఎంత ప్రమాదమో, దాని వల్ల కలిగే అనర్థాలు ఏమిటో, చట్టాల పట్ల, ప్రత్యేకించి కోర్టుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో , అనుకోకుండా ఈ చట్టానికి బలై పోతే జీవితాలు ఎలా ఇబ్బందులకు గురవుతాయో స్పష్టం చేశాడు దర్శకుడు. తను ఈ కథను రాసుకునేందుకు మూడేళ్లు పట్టిందన్నాడు ఈ మధ్యనే చిట్ చాట్ సందర్బంగా . విడుదలైన నాటి నుంచి నేటి దాకా థియేటర్ల వద్దకు సినిమా చూసేందుకు రావడం విశేషం.
ఈ సందర్బంగా నాని మాట్లాడుతూ కథ బలంగా ఉంటే సినిమా ఆడుతుందనేది కోర్ట్ చిత్రం ద్వారా నిరూపితమైందని అన్నాడు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపాడు. చాన్నాళ్ల తర్వాత శివాజీ సైతం ఇందులో కీలక పాత్ర పోషించాడు. తనను గుర్తించి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాడు నానికి. ఇక తాజాగా కోర్ట్ చిత్రాన్ని చేజిక్కించుకునేందుకు పలు సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఏకంగా రూ. 8 కోట్లకు చేజిక్కించు కోవడం మూవీ మేకర్స్ ను సైతం విస్మయానికి గురి చేసింది.
Also Read : Hero Chiranjeevi-Anil Ravipudi :మెగాస్టార్ న్యూ మూవీ అప్ డేట్