Neha Kakkar : ప్రముఖ సింగర్, టెలివిజన్ షోస్ కు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ తక్కువ కాలంలోనే ఎక్కువ ఆదరణ పొందిన నేహా కక్కర్ సభా వేదికపైనే ఏడ్చేశారు. ఈ ఘటనకు వేదికైంది ఆస్ట్రేలియా. తనను ప్రత్యేకంగా పిలిచారు. కానీ నిర్దేశించిన టైంకు సింగర్ చేరుకోలేదు. మూడు గంటలు ఆలస్యమైంది. దీంతో ఎన్నో గంటల నుంచి వేచి ఉన్న అక్కడి జనం సీరియస్ అయ్యారు. ఇదేం పద్దతి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై నీ పాటలు, నువ్వు మాకు వద్దంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇక్కడి నుంచి వెళ్లి పోవాలంటూ గో బ్యాక్ సింగర్ నేహా కక్కర్(Neha Kakkar) దద్దరిలిల్లేలా అరిచారు. దీంతో విస్మయానికి గురైంది నేహా కక్కర్.
Neha Kakkar Crying on Stage
తన కోసం ఇంత సేపు వేచి ఉన్నందుకు తనను మన్నించాలని కోరింది. అనుకోకుండా ఆలస్యం జరిగిందని, కావాలని చేసింది కాదంటూ పేర్కొంది. వినిపించుకోక పోవడంతో స్టేజి పైనే నేహా కక్కర్ కంటతడి పెట్టింది. అయినా ఒప్పుకోలేదు. ఉన్న కొద్ది మందితోనే వినిపించుకోకుండానే గాయని తనకు తోచిన పాటలను పాడింది. ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో పెద్ద ఎత్తున నేహా కక్కర్ ను సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు.
తను చేసిన ఈ పనికి ఇప్పుడు భారత దేశాన్ని తిట్టని తిట్లు తిడుతున్నారు. ఇండియన్స్ ఎప్పుడూ ఆలస్యంగా వస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు. విదేశాలలో ముఖ్యంగా అభివృద్ది చెందిన దేశాలలో ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా , ఏ పదవిలో ఉన్నా సరే వారంతా సాధారణంగా ఉంటారు. చెప్పిన, నిర్దేశించిన టైంకు ఠంఛనుగా వస్తారు. భారతీయులు అలా కాదు. ఇచ్చిన టైంను లెక్క చేయరు. ఆశించిన దానికంటే ఎక్కువగా తమను తాము గొప్పగా భావించుకుంటారు. క్షమాపణ చెప్పినా వినిపించుకోలేదు.
Also Read : Producer Naga Vamsi Shocking :నెల్సన్ తో ఓకే కానీ ఎన్టీఆర్ తో కాదు