Neha Kakkar : సింగర్ గా, హోస్ట్ గా పేరు పొందారు నేహా కక్కర్(Neha Kakkar). ఆమె ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. దానికి కారణం తాను ఆస్ట్రేలియా వేదికగా నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్. ఇందులో స్టేజి మీదనే నేహా కక్కర్(Neha Kakkar) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చివరకు కన్నీళ్లు కార్చారు. ఆమెను అక్కడి నుంచి వెళ్లి పోవాలంటూ ప్రేక్షకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నేహా కక్కర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తను కావాలని చేయలేదంటూ స్పష్టం చేసింది. వేడుకుంది కూడా. అయినా వారు కనికరించలేదు.
Neha Kakkar Husband Shocking Comments
దీనికి ప్రధాన కారణం ఏమిటంటే నేహా కక్కర్ పేరుతో మ్యూజిక్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆమె అనుకున్న సమయానికి కార్యక్రమానికి హాజరు కాలేక పోయారు. ఏకంగా మూడున్నర గంటలు ఆలస్యంగా వచ్చారు. వచ్చీ రావడంతోనే తాను లేట్ అయినందుకు క్షమించాలని కోరారు. మన్నించాలని అన్నారు. దీనిని పట్టించుకోలేదు ప్రేక్షకులు. టికెట్లు తీసుకుని తన పాటల కోసం వేచి ఉన్న తమను ఇలా నిరీక్షించేలా చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఇదే సమయంలో భారతీయులకు , ప్రధానంగా ప్రముఖ సినీ నటులు, మోడల్స్, హోస్ట్ లు, సింగర్స్ కు కామన్ సెన్స్ ఉండదని, టైమ్ సెన్స్ అసలే ఉండదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిప్పులు చెరిగారు. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై నేహా కక్కర్ భర్త స్పందించాడు. వాస్తవం ఏమిటో తెలుసుకోకుండా ఇష్టానుసారం ఆరోపణలు, విమర్శలు చేస్తే ఎలా అని ప్రశ్నించాడు. లోకం ఏమన్నా అనుకోని తన భార్యకు తాను మద్దతుగా ఉంటానని ప్రకటించాడు. దీంతో చాలా మంది తనను అభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా నేహా కక్కర్ బద్రీ కి దుల్హానియా, సన్నీ సన్నీ, కోకా కోలా, గార్మి, గలి గలి వంటి హిట్ పాటలతో ప్రసిద్ధి చెందింది.
Also Read : Hero Shah Rukh-Jonh Abraham :జాన్ అబ్రహం షారుక్ ఖాన్ కిస్ వైరల్