Nayanthara : తమిళ సినీ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటి నయనతార(Nayanthara). తను ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో యశ్ తో టాక్సిక్ మూవీలో కలిసి నటిస్తోంది. ఇందులో తనతో పాటు మాళవికా మోహన్, హుమా ఖురేషీ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక నయన్ గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే తనకు రూ. 100 కోట్లు ఇచ్చినా తనతో నటించే ప్రసక్తి లేదంటూ ప్రకటించిందని.
Nayanthara Shocking Comments
ఇంతకూ ఎవరా నటుడని ఆరా తీస్తే ది లెజండ్ మూవీతో తెరంగేట్రం చేసిన హీరో శరవణ్ణన్ అని తెలిసి పోయింది. తను అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన హిందీ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్ లో షారుక్ ఖాన్ సరసన నటించింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నయనతార. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కీలక పాత్రలు పోషించింది. సూపర్ హిట్ మూవీస్ లో నటించి మెప్పించింది.
తమిళ సినీ నటుడు విఘ్నేష్ శివన్ తో బంధం ఏర్పర్చుకుంది. వీరికి ఇద్దరు కవల పిల్లలు. ప్రస్తుతం తను పెళ్లి చేసుకున్నా ఎక్కడా తన అందాన్ని కోల్పోలేదు. ఇచ్చిన పాత్రకు న్యాయం చేయడం తప్పితే వేరే దానిపై ఫోకస్ పెట్టేందుకు ఇష్ట పడదు. ఈ సందర్బంగా శరవణ్ణన్ తో ఆరు నూరైనా సరే నటించే ప్రసక్తి లేదని పేర్కొంది. నయన్ తాజాగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Chhaava Telugu Trailer Sensational :ఛావా తెలుగు ట్రైలర్ విడుదల