Nayanthara : నయన్ ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందా..?

కెరీర్‌లో ఇంతవరకు చేయని ఓ డిఫరెంట్ అటెంప్ట్ త్వరలో చేయబోతున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది...

Hello Telugu - Nayanthara

Nayanthara : స్టార్ హీరోయిన్ నయనతార రూటు మారుస్తున్నారు. ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాలు చేస్తున్నా.. కమర్షియల్ ట్రెండ్‌కు మాత్రం కాస్త దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలంటే గ్లామర్ ఇమేజ్‌ కూడా కంటిన్యూ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. ఈ మధ్య ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల మీదే కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు సీనియర్ హీరోయిన్‌ నయనతార(Nayanthara). ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలంటే గ్లామర్ ఇమేజ్‌ కూడా కంటిన్యూ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. ఈ మధ్య ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాల మీదే కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు సీనియర్ హీరోయిన్‌ నయనతార.

Nayanthara Movie Updates

కెరీర్‌లో ఇంతవరకు చేయని ఓ డిఫరెంట్ అటెంప్ట్ త్వరలో చేయబోతున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇంతవరకు స్పెషల్ సాంగ్‌లో కనిపించలేదు నయనతార(Nayanthara). తాను హీరోయిన్‌గా నటించిన సినిమాల్లో టూ హాట్‌ అన్న రేంజ్‌ సాంగ్స్ చేసినా… కేవలం ఒక్క పాటలో కనిపించే హీరోయిన్‌గా మాత్రం ఏ సినిమాలోనూ నటించలేదు. అందుకే త్వరలో ఆ ప్రయోగం కూడా చేయబోతున్నారట నయన్‌. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్‌ కామెడీ మూవీ ది రాజాసాబ్‌. మాళవిక మోహన్‌, నిధి అగర్వాల్ హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కూడా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.

ఆపాటలో హీరోయిన్‌గా నయనతారను తీసుకోవాలని భావిస్తోంది రాజాసాబ్ టీమ్‌. గతంలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన బాబు బంగారం సినిమాలో హీరోయిన్‌గా నటించారు నయన్‌. ఆ పరిచయంతోనే ది రాజాసాబ్‌లో స్పెషల్ సాంగ్‌ కోసం ఆమె సంప్రదించారు. నయన్‌ కూడా ప్రభాస్‌ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించారన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Also Read : Pawan Kalyan : డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com