Nayanthara: నాలుగు పదుల వయసులో కూడా చెక్కు చెదరని అందం… వహ్వా అనిపించే అభినయం… అన్నింటికీ మించి క్యారెక్టర్ ఏదైనా అందులో ఒదిగిపోయి… అగ్రహీరోలకు సమానంగా స్టార్ డమ్ సంపాదించుకున్న దక్షిణాది అగ్రతారగా, లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార(Nayanthara). సాధారణంగా సినిమా ఆఫర్లు లేనప్పుడు ఇతర సంపాదన మీద ఆధారపడుతుంటారు… సెలబ్రెటీలు. అయితే నాలుగు పదుల వయసులో కూడా ఈమె ఒకవైపు పాన్ ఇండియా రేంజ్ సినిమాలు, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ… ఇంకోవైపు యాడ్ ఫిల్మ్స్ లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది.
Nayanthara….
ఒక సినిమా కోసం మూడు, నాలుగు నెలలు కష్టపడితే వచ్చే పారితోషికం కంటే ఒక నిముషం పాటు కనిపించే యాడ్ ఫిల్మ్ సంపాదనే ఎక్కువగా ఉండడంతో చాలా మంది సెలబ్రెటీలు ఇప్పుడు యాడ్ ఫిల్మ్స్‌లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందరికంటే ఒక అడుగు ముందుకు వేసి యాభై సెకన్ల యాడ్ ఫిల్మ్ లో నటించినందుకు అక్షరాలా రూ. ఐదు కోట్లు వసూలు చేసి వార్తల్లో నిలిచారు నయనతార(Nayanthara). ఒక సినిమాకి నెలంతా కాల్ షీట్స్ కేటాయించి పొందే పారితోషికానికి సమానంగా 50 సెకండ్లు కనిపించే ప్రకటనలో పొందడం అన్నది బహుశా దక్షిణాదిలోనే ఏకైక నటి నయనతార కావచ్చు. ఈమెకు ఇంత పారితోషికం చెల్లించింది డీటీహెచ్ సంస్థ అయిన టాటా స్కై అని సమాచారం. కొన్ని నెలల నుంచి ఆ సంస్థ సౌత్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా నయన్ ఉంది.
ఇంతకుముందు నయనతార(Nayanthara) పారితోషికం రూ. ఐదు కోట్లే ఉండేది. కానీ హిందీ చిత్రం ‘జవాన్’ సూపర్ హిట్ అయిన తర్వాత అమాంతం తన పారితోషికాన్ని పది కోట్ల రూపాయలకు నయనతార పెంచేసిందని నిర్మాతలు చెబుతున్నారు. అంటే సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకొనే హీరోయిన్ నయనతారే అన్నమాట. ఇప్పుడు యాడ్ ఫిల్మ్స్ తోనూ ఆమె మోత మోగిస్తోంది. ప్రస్తుతం నయనతార తన భర్త విఘ్నేశ్, కవల పిల్లలతో గ్రీస్‌లో జాలీగా విహరిస్తోంది.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో మలయాళీ బ్యూటీ నయనతారది ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోవచ్చు. సినిమా ఆరంభ కాలంలో పలు అవమానాలను, ఆవేదనలు, కష్టాలను చవి చూసినా ఆ తర్వాత మాత్రం చాలా వేగంగా స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఆ తరువాత ప్రేమలో ఓడిపోవడం, పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గటం వంటివి పరిస్థితులను కూడా ఎదుర్కొంది. శింబు, ప్రభుదేవలతో ప్రేమాయణం, విడిపోవడాలు వంటి ఘటనలు జరిగినప్పటికీ నయనతార మాత్రం అగ్రస్థాయికి ఎదిగారు. ఆ తరువాత దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకున్న తరువాత కాస్తా అవకాశాలు తగ్గాయి. అయితే ఈ రెండు విషయాలు నయనతారను కథానాయకిగా మరింత ఎదగడానికి దోహదపడ్డాయని చెప్పవచ్చు. తిరిగి శ్రీ రామరాజ్యం సినిమాతో సక్సెస్ బాట పట్టి… ఏకంగా లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొంది.
Also Read : Prathinidi 2: నాలుగు నెలల తర్వాత ఓటీటీకి వచ్చిన నారా రోహిత్ “ప్రతినిధి 2” !