Nayanthara : ధనుష్ దావా పై ఘాటుగా స్పందించిన నయనతార

ఈ నేపథ్యంలోనే నయనతార లాయర్ రెస్పాండ్ అయ్యారు...

Hello Telugu - Nayanthara

Nayanthara : హీరోయిన్ నయనతార, ఆమె భర్త దర్శకుడు విఘ్నేశ్ శివన్‌పై కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దావా వేసిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘నయనతార(Nayanthara) బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో తన అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ విజువల్స్‌ను వాడుకోవడంపై ఆయన నిర్మాణసంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా. ఈ పిటిషన్ ని మద్రాస్ కోర్ట్ స్వీకరించింది. కాగా ఈ కేసు విచారణను డిసెంబర్ 2కి వాయిదా వేశారు.

Nayanthara Slams..

ఈ నేపథ్యంలోనే నయనతార లాయర్ రెస్పాండ్ అయ్యారు. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో విజువల్స్ సినిమాలోవి కావని స్పష్టం చేశారు. ఆ విజువల్స్ కేవలం బీటీఎస్ అని పేర్కొన్నారు. వ్యక్తిగత లైబ్రరీ నుండి విజువల్స్ వాడుకుంటే అడ్డుకోవడానికి వాళ్ళు ఎవరన్నారు. ఇది చట్టపరంగా ఉల్లంఘన కిందకు రాదని తెలిపారు.

మరోవైపుధనుష్ అడ్డు చెప్పినా.. నయనతార డేరింగ్‌గా ఈ డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయించింది. దీంతో హర్ట్ అయిన ధనుష్.. వారిపై కోర్టులో దావా వేశారు. ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ విషయానికి వస్తే.. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ సక్సెస్‌పుల్‌గా రన్ అవుతూ.. టాప్‌ 1లో ట్రెండ్ అవుతోంది. ఇందులో నయనతార కెరీర్‌‌‌ను, ఎదుర్కొన్న అవమానాలు, విమర్శలను ఇందులో చూపించారు. ఇంకా విఘ్నేశ్‌తో ప్రేమ, పెళ్లి వంటి వాటిని చూపించే విషయంలో ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ ఎంతో కీలకమైన పాత్ర పోషించడంతో.. ఆ సినిమా విజువల్స్‌ని ఇందులో చూపించడమే.. ధనుష్‌ కోపానికి కారణమైంది.

Also Read : Mokshagna Tej : నందమూరి మోక్షజ్ఞ ‘సింబా’ సినిమా నుంచి కీలక అప్డేట్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com